Published : May 22, 2025, 11:29 AM ISTUpdated : May 22, 2025, 11:35 AM IST
ప్రస్తుతం తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే ఊహించారా? అంటే ఆయన చర్యలు అవుననే చెబుతున్నాయి. ఎప్పుడో ఐదారు నెలలకిందే ఈ భారీ వర్షాలకు గుర్తించిన సీఎం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. అవేంటో చూద్దాం.
Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండ్రోజులుగా సూర్యుడి జాడే లేదు... ఆకాశం మబ్బులతో కమ్మేసి ఉంది. హైదరాబాద్ తో సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి... దీంతో ఎండాకాలంలోనే వరదలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది... ఈ వర్షాలు, వరదల నుండి ప్రజలను కాపాడేందుకు ప్రత్యేకంగా 12 స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డిఆర్ఎఫ్) టీమ్స్ ను రెడీ చేసింది.
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు ఈ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (SDRF) ను ప్రారంభించింది. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో 2 వేల మందితో దీన్ని ఏర్పాటుచేసారు. ప్రకృతి విపత్తులు, ప్రమాదాల సమయంలో సహాయక చర్యల కోసం వీరిని ఉపయోగిస్తారు.
25
తెలంగాణలో భారీ వర్షాలు
అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం, అరేబియా సముద్రంలో ఆవర్తనం, నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నారు. మరో నాలుగైదు రోజులు ఈ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే నదులు, రిజర్వాయర్లు, వాగులు వంకలు, చెరువులకు వరదనీరు చేరి ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరి ప్రజలు ఇబ్బంది పడవచ్చు. అందుకే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రేవంత్ సర్కార్ ఎస్డిఆర్ఎఫ్ ను రంగంలోకి దింపింది.
35
ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా రెడీ
ఇప్పటికే హైదరాబాద్ లో మూడు ఎన్డిఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) టీమ్స్ రెడీగా ఉన్నాయి. వీరికి మరో 12 ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ జత కానున్నాయి. ఒక్కో ఎస్డిఆర్ఎఫ్ టీమ్ లో 100 మంది పోలీసులు ఉంటారు... అంటే మొత్తం 1200 మందికి పైగా పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొననున్నారు. ముంపు ప్రాంతాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించారు.. ఈ ప్రాంతాల్లో అనుకోకుండా ఏదయినా విపత్తు వస్తే ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ వెంటనే రంగంలోకి దిగేందుకు రెడీగా ఉంటారు.
ఇక ఇప్పటికే అకాల వర్షాల దాటికి తెలంగాణలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. గూడూరు మండలం గుండెంగలో ప్రవీణ్ కుమార్ (27). ఓటాయి గ్రామంలో గొర్రెల కాపరి చేరాలు(55) మృతి చెందారు. ఇక నల్గొండ జిల్లాలో మహిళా రైతు భిక్షమమ్మ(46), వనపర్తి జిల్లాలో గోపాల బాలరాజు(20) పిడుగుపాటుకు గురయి చనిపోయారు. మరికొద్దిరోజులు ఇలాగే పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.
55
ఏపీలో భారీ వర్షాలు... సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు
ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, పిడగులు పడతాయని తెలిపారు. దీంతో విపత్తుల నిర్వహణ సంస్థలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసింది. అత్యవసర సమయంలో సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 1070,112, 18004250101 ఫోన్ చేయాలని సూచించారు.