తెలంగాణలో ఎక్కడి నుంచైనా విజయవాడకు.. జస్ట్ రూ.150లో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?

Published : Oct 06, 2026, 06:48 PM IST

RTC: తెలంగాణలోని దూర ప్రాంతాల నుంచి విజయవాడకు వెళ్లే వారికి టికెట్ ఛార్జీ రూ.500 నుంచి రూ.700 వరకు ఉండొచ్చు. అయితే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా శక్తి ఉచిత బస్సు పథకాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే తక్కువ ఖర్చుతో విజయవాడ చేరుకోవచ్చు.

PREV
15
కామారెడ్డి నుంచి విజయవాడకు వెళ్తే..

ఉదాహరణకు కామారెడ్డికి చెందిన ఒక మహిళ విజయవాడకు వెళ్లాలనుకుందాం. సాధారణంగా కామారెడ్డి నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణిస్తే దాదాపు రూ.700 వరకు ఖర్చు కావచ్చు. అయితే మహిళా శక్తి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటే ఈ ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చు. ముందుగా కామారెడ్డి నుంచి సిద్ధిపేటకు మహిళ ఉచిత బస్సు టికెట్‌తో ప్రయాణించవచ్చు. మహిళా ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండటంతో ఇక్కడ ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

25
సిద్ధిపేట నుంచి జనగాం వరకు ఉచిత ప్రయాణం

సిద్ధిపేట చేరుకున్న తర్వాత అక్కడి నుంచి జనగాం వైపు వెళ్లే బస్సును ఎక్కవచ్చు. ఈ మార్గంలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు అందుబాటులో ఉంటాయి. మహిళా ప్రయాణికులు అర్హత ఉన్న బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అంటే కామారెడ్డి నుంచి సిద్ధిపేటకు ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా, సిద్ధిపేట నుంచి జనగాం వరకు కూడా ఉచితంగా ప్రయాణం కొనసాగించవచ్చు. ఇలా దశలవారీగా బస్సులు మార్చుకుంటూ ముందుకు వెళ్లాలి.

35
జనగాం నుంచి సూర్యాపేట.. అక్కడి నుంచి కోదాడ

జనగాం చేరుకున్న తర్వాత అక్కడి నుంచి సూర్యాపేటకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సును ఎక్కవచ్చు. మహిళా శక్తి పథకం కింద అర్హత ఉన్న బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. సూర్యాపేట చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కోదాడకు మరో ఎక్స్‌ప్రెస్ బస్సులో వెళ్లవచ్చు. ఈ ప్రయాణానికి కూడా అర్హత ఉన్న మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా కామారెడ్డి నుంచి కోదాడ వరకు దాదాపు మొత్తం ప్రయాణాన్ని ఉచితంగానే పూర్తి చేయవచ్చు.

45
కోదాడ నుంచి విజయవాడకు మాత్రమే ఛార్జీ

కోదాడ చేరుకున్న తర్వాతే విజయవాడ ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కోదాడ నుంచి విజయవాడకు ఎక్స్‌ప్రెస్ బస్సులో ఛార్జీ సుమారు రూ.150 వరకు ఉండొచ్చు. దీంతో కామారెడ్డి నుంచి విజయవాడ వరకు సాధారణంగా రూ.700 వరకు అయ్యే బస్సు ఖర్చును కేవలం రూ.150కు తగ్గించుకోవచ్చు.

ఇదే విధంగా తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా అందుబాటులో ఉన్న రూట్లను అనుసంధానం చేసుకుంటూ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాల నుంచి నేరుగా ఇదే రూట్ ఉండాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న బస్సు మార్గాలను ముందుగా తెలుసుకుని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది.

55
ఈ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం

అయితే మహిళా ప్రయాణికులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉచిత ప్రయాణ సౌకర్యం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే వర్తిస్తుంది. డీలక్స్, రాజధాని, సూపర్ లగ్జరీ వంటి బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తించదు. అలాగే పండగల సమయంలో ఏర్పాటు చేసే స్పెషల్ బస్సులకు కూడా ఉచిత ప్రయాణ పథకం వర్తించదు. కాబట్టి ప్రయాణానికి ముందు బస్సు ఏ కేటగిరీకి చెందిందో నిర్ధారించుకోవాలి. సరైన బస్సులను ఎంచుకుని రూట్‌ను ముందుగానే ప్లాన్ చేసుకుంటే మహిళలు తక్కువ ఖర్చుతో విజయవాడ చేరుకోవచ్చు.

మరెందుకు ఆలస్యం ఈ ట్రిక్‌ను ఉప‌యోగించుకొని ఈ ద‌స‌రాకు విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై వెలిసిన క‌న‌క‌దుర్గ అమ్మ‌వారిని ద‌ర్శించుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories