Real Estate: తెలంగాణ‌లో 2 కొత్త ఎయిర్ పోర్టుల‌కు ముహుర్తం ఖ‌రారు.. ఇక్క‌డ భూములు కొన్న వారి రాత మారిన‌ట్లే

Published : Mar 18, 2026, 09:50 AM IST

Real Estate: తెలంగాణలో రెండు విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వరంగల్ సమీపంలోని మామునూరు, ఆదిలాబాద్‌లో కొత్త ఎయిర్‌పోర్టులు రూపుదిద్దుకోనున్నాయి. వీటితో ఈ ప్రాంతాల రూపురేఖ‌లు మార‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

PREV
15
జూన్‌లో శంకుస్థాపనకు సన్నాహాలు

మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు త్వరలోనే శంకుస్థాపన జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసింది. ఈ పరిణామం రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద సంకేతంగా భావిస్తున్నారు. ప్రాజెక్ట్ ప్రకటించే దశ నుంచే భూముల ధరలు పెరగడం ప్రారంభమైంది.

25
మామునూరు ఎయిర్‌పోర్ట్… వరంగల్‌కు కొత్త గేట్‌వే

వరంగల్ జిల్లా మామునూరులో నిర్మించనున్న విమానాశ్రయం కోసం భారీ ప్రణాళిక సిద్ధమైంది. టెర్మినల్ భవనం, రన్‌వే, ఏటీసీ సెంటర్ వంటి మౌలిక సదుపాయాలకు కలిపి సుమారు రూ.850 కోట్ల వ్యయం అంచనా వేశారు. అదనపు భూముల కోసం రూ.295 కోట్లు కేటాయించగా, ఇతర అనుసంధాన పనులకు కూడా నిధులు విడుదల చేశారు. ముఖ్యంగా రోడ్ల కనెక్టివిటీ మెరుగుపరచడం వల్ల పరిసర గ్రామాల విలువ ఒక్కసారిగా పెరగనుంది.

ఈ ఎయిర్ పోర్ట్ రాకతో వ‌రంగ‌ల్ రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ప‌డుతుంది. మామునూరు చుట్టుపక్కల వ్యవసాయ భూములు త్వరలో ప్లాట్లుగా మారే అవకాశం ఉంది. వరంగల్ నగర విస్తరణ వేగవంతం కావ‌డ‌నికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. కమర్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతుంది.

35
ఆదిలాబాద్‌లో 1,100 ఎకరాల్లో మెగా ప్రాజెక్ట్

ఆదిలాబాద్ విమానాశ్రయం దాదాపు 1,100 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఇప్పటికే కొంత భూమి అందుబాటులో ఉండగా, మిగతా భూసేకరణ కొనసాగుతోంది. మొత్తం ప్రాజెక్ట్‌కు రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ 2.9 కిలోమీటర్ల పొడవైన రన్‌వే నిర్మాణం ద్వారా పౌర, రక్షణ విమానాలు రెండూ ల్యాండ్ అయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ఎయిర్‌పోర్ట్ రాక‌తో పరిసరాల్లో ఇండస్ట్రియల్ జోన్ అభివృద్ధి జ‌ర‌గ‌నుంది. హోటల్స్, గోదాములు, లాజిస్టిక్స్ హబ్‌లకు డిమాండ్ ఏర్ప‌డుతుంది. దీంతో పెట్టుబడిదారుల దృష్టి ఆదిలాబాద్ వైపు మళ్లడం ఖాయం. అందులోనూ హైద‌రాబాద్ నుంచి ఉత్త‌ర భార‌త‌దేశానికి వెళ్లే ప్ర‌తీ విమానం ఆదిలాబాద్ మీదుగా వెళ్లే అవ‌కాశం ఉండ‌డంతో క‌నెక్టివిటీ పెరుగుతుంది.

45
పరిశ్రమలతో పాటు భూముల విలువ

ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తోంది. పరిశ్రమల కోసం 10 వేల ఎకరాల భూమి సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున భూములను గుర్తించారు. డిఫెన్స్, అగ్రి, తయారీ రంగాలకు చెందిన సంస్థలు ఇక్కడ స్థాపనకు ముందుకొస్తున్నాయి. విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ఈ పరిశ్రమలకు మరింత ఊతం లభిస్తుంది. దీంతో ఆదిలాబాద్‌లో ఇండస్ట్రియల్ ప్లాట్ల ధరలు వేగంగా పెరుగుతాయి. ఉద్యోగాల పెరుగుదలతో హౌసింగ్ డిమాండ్ పెరుగుతుంది. టియర్-2 నగరంగా ఆదిలాబాద్ మార‌నుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

55
ఇప్పుడే పెట్టుబడి పెడితే భారీగా లాభాలు.

మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులు పూర్తయ్యేలోపే భూముల ధరలు గణనీయంగా పెరిగే అవకాశముంది. ప్రస్తుత దశలో పెట్టుబడి పెట్టే వారికి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్‌కు 10–20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూములు, రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలు, ఇండస్ట్రియల్ జోన్‌లకు సమీప ప్రాంతాలు రాబోయే సంవత్సరాల్లో హాట్‌స్పాట్స్‌గా మారే అవకాశముంది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డులు పెట్టే ముందు నిపుణుల సూచ‌న‌లు కూడా తీసుకోవ‌డం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories