Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్

Published : Dec 21, 2025, 07:45 AM IST

Ration Card: ప్ర‌స్తుతం అన్ని రంగాల్లో డిజిట‌ల్ సేవ‌లు విస్త‌రిస్తున్నాయి. ప్ర‌భుత్వాలు కూడా డిజిట‌లైజేష‌న్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టీ రేష‌న్ పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. 

PREV
15
టీ రేష‌న్ యాప్ అంటే ఏంటి?

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు సేవలను డిజిటల్ రూపంలో అందించేందుకు రూపొందించిన అధికారిక మొబైల్ అప్లికేషనే T-Ration App. ఇది ePDS వ్యవస్థకు చెందిన యాప్. రేషన్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే షాపులకు లేదా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మొబైల్ ద్వారానే అన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఈ యాప్ ఇస్తుంది.

25
ఈ యాప్ ప్రారంభించడానికి కారణం

రేషన్ వచ్చిందా లేదా, ఎంత సరుకు కేటాయించారు, గత నెలలో ఎంత తీసుకున్నారు అనే విషయాలపై చాలా మందికి స్పష్టత ఉండ‌దు. ఈ స‌మాచారం కావాలంటే డీలర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. ఈ గందరగోళాన్ని తొలగించేందుకు ప్రభుత్వం T-Ration App తీసుకొచ్చింది. అధికారిక సమాచారం నేరుగా మొబైల్‌లో క‌నిపిస్తుంది.

35
T-Ration Appలో లభించే ప్రధాన సౌకర్యాలు

ఈ యాప్ ద్వారా రేషన్ కార్డు నంబర్, కార్డు రకం, కుటుంబ సభ్యుల వివరాలు చూడవచ్చు. ప్రస్తుత నెలకు ఎంత బియ్యం, చక్కెర, గోధుమలు కేటాయించారో స్పష్టంగా చూపిస్తుంది. ఎప్పుడు రేషన్ తీసుకున్నారు అనే పూర్తి ట్రాన్సాక్షన్ వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. కేటాయించిన ఫెయిర్ ప్రైస్ షాప్ వివరాలు, డీలర్ సమాచారం కూడా ఈ యాప్‌లో చూడవచ్చు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సులభమైన డిజైన్ ఉండటంతో అందరికీ ఉపయోగించుకోవడం సులువుగా ఉంటుంది.

45
ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా ఉప‌యోగించాలి.?

* Android మొబైల్‌లో Google Play Store ఓపెన్ చేయాలి.

* “T-Ration Telangana” అని సెర్చ్ చేయాలి.

* ప్రభుత్వ అధికారిక యాప్ ఎంచుకుని Install చేయాలి.

* యాప్ ఓపెన్ చేసిన తర్వాత భాష ఎంపిక చేసుకోవాలి.

* రేషన్ కార్డు నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంట‌ర్ చేయాలి.

* OTP వెరిఫికేష‌న్‌ పూర్తి చేయాలి.

* తర్వాత రేషన్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

55
ఈ యాప్ వల్ల ప్రజలకు కలిగే లాభాలు

ఈ యాప్ వాడటం వల్ల ఆఫీసులు, రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఇంట్లో నుంచే పూర్తి రేషన్ సమాచారం తెలుసుకోవచ్చు. రేషన్ పంపిణీలో స్పష్టత ఉండటంతో అనవసర సందేహాలు తొలగిపోతాయి. పేపర్ డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. వృద్ధులు, మహిళలు బయటకు వెళ్లకుండా రేషన్ వివరాలు చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇది ఎంతో ఉపయోగపడే యాప్.

Read more Photos on
click me!

Recommended Stories