Rapido: హైదరాబాద్‌లో మహిళల కోసం రాపిడో ప్రత్యేకంగా పింక్ బైక్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇంతకీ సర్వీస్ ఉద్దేశం ఏంటి.? ఎలా పనిచేస్తుంది.? దీనివల్ల మహిళా యూజర్లకు కలిగే ప్రయోజనం ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో ప్రయాణించే మహిళలకు రాపిడో పింక్ బైక్ మరో రవాణా ఎంపికగా మారనుంది. ఈ సర్వీస్‌లో క్యాప్టెన్, ప్రయాణికురాలు ఇద్దరూ మహిళలే ఉంటారు. అంటే మహిళా ప్రయాణికుల రైడ్స్‌ను మహిళా బైక్ క్యాప్టెన్లతోనే మ్యాచ్ చేస్తారు. ముఖ్యంగా విద్యార్థినులు, ఉద్యోగాలు చేసే మహిళలు రాత్రి సమయాల్లో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఈ సర్వీస్ ఉపయోగపడే అవకాశం ఉంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ విధానం వల్ల బైక్‌పై ప్రయాణించేటప్పుడు మరింత సౌకర్యంగా ఉంటుందని రాపిడో భావిస్తోంది.
25
మహిళలకు సేఫ్ కమ్యూటింగ్‌పై ఫోకస్
సాధారణంగా బైక్ ట్యాక్సీ సేవలను ఉపయోగించే సమయంలో క్యాప్టెన్ ఎవరు అనే విషయంలో మహిళా ప్రయాణికులకు కొంత ఆందోళన ఉండొచ్చు. ఈ నేపథ్యంలో రాపిడో పింక్ బైక్‌లో మహిళా క్యాప్టెన్లతోనే మహిళా ప్రయాణికులకు సేవలు అందించేలా వ్యవస్థను రూపొందించింది. విద్య, ఉద్యోగం, ఇతర అవసరాల కోసం నగరంలో తరచూ ప్రయాణించే మహిళలకు ఇది ఉపయోగకరమైన ఎంపికగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన వారికి టూ వీలర్ రైడ్ సౌకర్యంగా ఉండొచ్చు.
35
మహిళలకు పార్ట్‌టైమ్ ఆదాయ అవకాశం
పింక్ బైక్ సర్వీస్ కేవలం ప్రయాణ సౌకర్యానికే పరిమితం కాదు. మహిళలు బైక్ క్యాప్టెన్లుగా చేరి ఆదాయం సంపాదించే అవకాశం కూడా ఉంది. ఇందులో ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ లాగిన్ సమయాలు లేవు. తమకు వీలైన సమయంలో క్యాప్టెన్లు పని చేసుకోవచ్చు. లాంచ్ వివరాల ప్రకారం.. రెండు గంటలు పని చేస్తే సుమారు రూ.400, నాలుగు గంటలు పని చేస్తే సుమారు రూ.800 వరకు సంపాదించే అవకాశం ఉందని రాపిడో తెలిపింది. అయితే వాస్తవ ఆదాయం రైడ్స్ సంఖ్య, పని చేసే సమయం తదితర అంశాలపై ఆధారపడి మారవచ్చు.
పింక్ బైక్ క్యాప్టెన్లకు రాపిడో 0 శాతం కమిషన్ ఆఫర్ చేస్తోంది. అంటే రైడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో కమిషన్ కట్ ఉండదని కంపెనీ తెలిపింది. దీంతో పాటు కొత్తగా చేరే మహిళలకు రూ.5,000 వరకు జాయినింగ్ బోనస్ అందించే అవకాశం ఉంది. రోజువారీ, వారపు ఇన్సెంటివ్‌లు కూడా అందిస్తున్నట్లు రాపిడో వెల్లడించింది. దీంతో మహిళలు తమ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని అదనపు ఆదాయం సంపాదించవచ్చు.
55
పింక్ బైక్ క్యాప్టెన్‌గా ఎలా చేరాలి?
హైదరాబాద్‌లో పింక్ బైక్ క్యాప్టెన్‌గా చేరాలనుకునే మహిళలు ర్యాపిడో క్యాప్టెన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తమకు అందుబాటులో ఉన్న సమయంలో పని చేసుకునే అవకాశం ఉండటంతో విద్యార్థినులు, ఉద్యోగులు, ఇతర మహిళలకు ఇది ఫ్లెక్సిబుల్ వర్క్ ఆప్షన్‌గా ఉపయోగపడొచ్చు. మహిళా ప్రయాణికులకు ప్రత్యేక రైడ్ సర్వీస్ అందించడంతో పాటు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాన్ని కల్పించేలా ర్యాపిడో పింక్ సేవను రూపొందించారు. దీంతో హైదరాబాద్‌లో మహిళల ప్రయాణ అవసరాలకు ఇది మరో కొత్త ఎంపికగా మారనుంది.