Published : Dec 06, 2023, 05:32 PM ISTUpdated : Dec 06, 2023, 05:49 PM IST
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు రాజశ్యామల యాగం చేశారు. అయినా కూడ ఈ దఫా కేసీఆర్ కు తెలంగాణలో అధికారం దక్కలేదు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించారు.ఆ ఎన్నికల్లో కేసీఆర్ అధికారం దక్కించుకున్నారు.
రాజశ్యామల యాగం చేసినా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఈ దఫా ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. గత ఎన్నికల సమయంలో రాజశ్యామల యాగం చేసిన కేసీఆర్ కు రెండో దఫా అధికారం దక్కింది.ఈ దఫా ఎన్నికల సమయంలో కూడ రాజశ్యామల యాగం చేశారు. కానీ,ఈ దఫా మాత్రం రేవంత్ రెడ్డికి అధికారం దక్కలేదు.
ఈ దఫా ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి 39 అసెంబ్లీ స్థానాలే దక్కాయి. దరిమిలా ఆ పార్టీ అధికారానికి దూరమైంది. తెలంగాణలో మూడోసారి అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ సీఎంగా చరిత్ర సృష్టించాలని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భావించారు. కానీ, తెలంగాణ ఓటర్లు మాత్రం కేసీఆర్ కు ఈ అవకాశం ఇవ్వలేదు.
2014 ఎన్నికల తర్వాత మూడు దఫాలు కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించారు.2015లో తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ తొలిసారిగా రాజశ్యామల యాగం చేశారు.2018 ఎన్నికలకు ముందు కూడ రాజశ్యామల యాగం నిర్వహించారు. ఈ యాగం ముగించిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి ఈ యాగం దోహదపడుతుందని చెబుతుంటారు. రాజశ్యామల యాగాన్ని విశాఖ సరస్వతి పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆధ్వర్వంలో కేసీఆర్ నిర్వహించారు. ఈ యాగంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. 2018 ఎన్నికల ఫలితాల తర్వాత ఛండీ యాగం నిర్వహించారు కేసీఆర్.
2014, 2018 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడ రాజశ్యామల యాగంలో కూడ పాల్గొన్నారు. విశాఖ సరస్వతి పీఠాధిపతి ఆధ్వర్యంలో జరిగిన రాజశ్యామల యాగంలో జగన్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలై వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చింది.