Anumula Revanth Reddy:రేవంత్ రెడ్డిని రెండేళ్లకు ఏళ్లు మించి సీఎంగా ఉండనివ్వరా?

First Published | Dec 6, 2023, 2:03 PM IST

 మరో రెండేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని  కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో  చర్చకు దారి తీశాయి.  కడియం శ్రీహరి వ్యాఖ్యలు ఏ ఉద్దేశ్యంతో చేసినా  కూడ ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యాలపై చర్చ సాగుతుంది.

Anumula Revanth Reddy:రేవంత్ రెడ్డిని రెండేళ్లకు ఏళ్లు మించి సీఎంగా ఉండనివ్వరా?

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఏర్పడిన  కాంగ్రెస్ ప్రభుత్వంలో  అనుముల రేవంత్ రెడ్డి సీఎంగా ఈ నెల  7వ తేదీన ప్రమాణం చేయనున్నారు.తెలంగాణ సీఎంగా  రేవంత్ రెడ్డిని  రెండేళ్లకు మించి ఉండనివ్వరా అనే చర్చ సాగుతుంది. రెండేళ్ల తర్వాత  తెలంగాణ సీఎంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  అవుతారని  భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Anumula Revanth Reddy:రేవంత్ రెడ్డిని రెండేళ్లకు ఏళ్లు మించి సీఎంగా ఉండనివ్వరా?

ఈ ఏడాది నవంబర్  30న జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ  64 మంది ఎమ్మెల్యేలతో  అధికారాన్ని కైవసం చేసుకుంది.  అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.  

Anumula Revanth Reddy:రేవంత్ రెడ్డిని రెండేళ్లకు ఏళ్లు మించి సీఎంగా ఉండనివ్వరా?

స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ స్థానం నుండి  కడియం శ్రీహరి  ఎమ్మెల్యేగా  విజయం సాధించారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులనుద్దేశించి కడియం శ్రీహరి ఆరు నెలలో, ఏడాదో, రెండేళ్లో  తెలంగాణలో కేసీఆర్ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Anumula Revanth Reddy:రేవంత్ రెడ్డిని రెండేళ్లకు ఏళ్లు మించి సీఎంగా ఉండనివ్వరా?

తెలంగాణలో  ఈ దఫా  కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది.  కాంగ్రెస్ పార్టీకి మేజిక్ ఫిగర్ కంటే  నాలుగు స్థానాలే ఎక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్  39 స్థానాల్లో మాత్రమే అధికారాన్ని చేపట్టింది. బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది.  ఎంఐఎం ఏడు స్థానాల్లో గెలుపొందింది.  కాంగ్రెస్ మద్దతుతో  సీపీఐ ఒక్క స్థానంలో నెగ్గింది.

Anumula Revanth Reddy:రేవంత్ రెడ్డిని రెండేళ్లకు ఏళ్లు మించి సీఎంగా ఉండనివ్వరా?

 బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు కలిస్తే  ఆ పార్టీల బలం  54కు  చేరుతుంది.  మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుండి బయటకు వస్తే   బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు  అవకాశం లేకపోలేదు.  కేసీఆర్ మరో రెండేళ్లకు  సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రకరకాల ఉహగానాలు వెలువడుతున్నాయి. 

Anumula Revanth Reddy:రేవంత్ రెడ్డిని రెండేళ్లకు ఏళ్లు మించి సీఎంగా ఉండనివ్వరా?

బీఆర్ఎస్ శ్రేణులు అధైర్య పడకుండా ఉండేందుకుగాను  కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేశారా... లేదా  భవిష్యత్తులో తమ రాజకీయ వ్యూహన్ని  శ్రీహరి  బయట పెట్టారా అనే  విషయమై  చర్చలు సాగుతున్నాయి. కడియం శ్రీహరి వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించలేదు.  సీఎం పదవిపై  మల్లు భట్టి విక్రమార్క, నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడ పోటీ పడ్డారు. కాంగ్రెస్ నాయకత్వం రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించింది.  

Anumula Revanth Reddy:రేవంత్ రెడ్డిని రెండేళ్లకు ఏళ్లు మించి సీఎంగా ఉండనివ్వరా?

2014 ఎన్నికల సమయంలో కూడ  బీఆర్ఎస్ బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కాంగ్రెస్,టీడీపీ, బీఎస్పీ ఎమ్మెల్యేలను  తమ వైపునకు తిప్పుకుంది. బీఆర్ఎస్ శాసనసభపక్షంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు విలీనమయ్యారు. దీంతో బీఆర్ఎస్ తన బలాన్ని పెంచుకుంది. 

Anumula Revanth Reddy:రేవంత్ రెడ్డిని రెండేళ్లకు ఏళ్లు మించి సీఎంగా ఉండనివ్వరా?

2014లో  బీఆర్ఎస్ లో  కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుపై  ఆనాడు  అసెంబ్లీలో  రేవంత్ రెడ్డి  పోరాటం చేశారు. న్యాయస్థానాలను కూడ ఆశ్రయించారు. కడియం శ్రీహరి వ్యాఖ్యల నేపథ్యంలో  తన ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు  2014లో కేసీఆర్ అవలంభించిన విధానాలను  రేవంత్ రెడ్డి అనుసరిస్తారా  లేదా అనేది  భవిష్యత్తు తేల్చనుంది.  

Latest Videos

click me!