Rain Alert: తెలుగు ప్ర‌జ‌ల‌కు కూల్ న్యూస్‌.. దంచి కొట్ట‌నున్న వ‌ర్షాలు, కొన్నిచోట్ల‌ వ‌డ‌గండ్ల వ‌ర్షాలు కూడా

Published : Feb 20, 2026, 05:31 PM IST

Rain Alert: వేస‌వి కాలం వ‌చ్చేసింది. క్ర‌మంగా ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్నాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో వాతావ‌ర‌ణ శాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల‌పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. 

PREV
14
ఏ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి?

ఫిబ్రవరి 22న మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో వర్షాల వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, భద్రాచలం ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం ఉండొచ్చు. కొన్ని చోట్ల వడగండ్ల వాన కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. మొత్తంగా 20 నుంచి 40 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

24
ఉష్ణోగ్రతల పరిస్థితి ఏంటంటే.?

ఇటీవలి రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల లోపే ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో మాత్రం అధికంగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 34.3 డిగ్రీలు, మహబూబాబాద్‌లో 34.4 డిగ్రీలు నమోదు కాగా, ఖమ్మంలో 33.4 డిగ్రీలు నమోదయ్యాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల మధ్య ఉన్నాయి. రానున్న రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 31 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశముంది. ఉపరితల గాలులు దక్షిణ–తూర్పు దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో వీచవచ్చు.

34
వర్షాలకు కారణమైన వాతావరణ పరిస్థితులు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థల ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

44
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి

ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్ష సూచనలు ఉన్నాయి. ఫిబ్రవరి 21 నుంచి మూడు రోజుల పాటు రాయలసీమ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 22 నుంచి రెండు రోజుల పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడవచ్చు. కోస్తా జిల్లాల్లో పొగమంచు పరిస్థితులు కొనసాగవచ్చు. అదే సమయంలో పగటిపూట ఎండ తీవ్రత కొద్దిగా పెరిగే సూచనలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories