ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసినా త‌గ్గేదేలే.. బ‌త్తాయిలంటూ వివాదాస్ప‌ద వీడియో పోస్ట్ చేసిన అన్వేష్‌

Published : Feb 20, 2026, 01:32 PM IST

Naa Anveshana: ప్ర‌పంచ యాత్రికుడిగా పేరుగాంచిన యూట్యూబ‌ర్ అన్వేష్ ఇటీవ‌ల త‌ర‌చూ వార్త‌ల్లో నిలున్నాడు. సోష‌ల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసి మంచి పేరు సంపాదించుకున్న అన్వేష్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నాడు. 

PREV
15
యూట్యూబర్ ‘నా అన్వేష్’కు భారీ షాక్

ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు పొందిన యూట్యూబర్ ‘నా అన్వేష్’కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పూర్తిగా నిలిపివేసింది. లక్షలాది ఫాలోవర్లు ఉన్న అకౌంట్ ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

25
వివాదాస్పద వ్యాఖ్యలు, పెరిగిన ఫిర్యాదులు

ఇటీవల అన్వేష్ చేసిన కొన్ని వీడియోలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. దేశం, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. పలువురు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని సోషల్ మీడియా పోస్టులు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

35
పోలీసుల లేఖ తర్వాత మెటా చర్య

దర్యాప్తులో భాగంగా పోలీసులు అన్వేష్ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న కొన్ని కంటెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మెటా సంస్థను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. సంస్థ అంతర్గతంగా సమీక్ష జరిపి అతని అకౌంట్‌ను బ్యాన్ చేసినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు 1.8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఈ ఖాతా, వివాదాల తర్వాత 1.3 మిలియన్లకు తగ్గింది. చివరకు ఖాతాను పూర్తిగా నిలిపివేశారు.

45
ఇన్‌స్టా బ్లాక్‌పై స్పందించిన అన్వేష్

ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్‌పై అన్వేష్ తనదైన శైలిలో స్పందించాడు. ఒక అకౌంట్ పోయినా తనకు మరెన్నో ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయని, ఎవ్వరూ తనను ఆపలేరని వ్యాఖ్యానించాడు. తన ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానెల్లు, ఫేస్‌బుక్‌ను శరీర భాగాలతో పోలుస్తూ వీడియో విడుదల చేశాడు. “నన్ను ఆపాలంటే నేరుగా నన్నే ఆపాలి” అనే అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి. బ‌త్తాయిలు అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

55
హీరో నుంచి వివాదాస్పద వ్యక్తిగా

కొద్ది నెలల క్రితం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై విమర్శలు చేసి ప్రశంసలు పొందిన అన్వేష్, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన కారణాలతో వార్తల్లో నిలిచాడు. ఒక దశలో అతనికి మద్ధతుగా ఉన్నవారే ప్రస్తుతం దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో సోషల్ మీడియాలో బాధ్యతాయుత వ్యాఖ్యల ప్రాముఖ్యతపై మళ్లీ చర్చ మొదలైంది.

Read more Photos on
click me!

Recommended Stories