PM Modi : హైదరాబాద్ పర్యటన సందర్భంగా పెళ్లి బృందానికి ఇబ్బంది కలగకూడదని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రధాని తన హెలికాప్టర్ ల్యాండింగ్‌ను మార్చుకుని 18 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించారు.
సెక్యూరిటీ కంటే జనమే ముఖ్యం: ప్రధాని మోదీ తీసుకున్న డెసిషన్ మామూలుగా లేదుగా
హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక నిర్ణయంతో అందరి మనసు గెలుచుకున్నారు. ఒక వివాహ వేడుకకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో తన హెలికాప్టర్ ల్యాండింగ్ ప్లాన్‌ను చివరి నిమిషంలో మార్చుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఆయన హైటెక్స్ వద్ద హెలికాప్టర్‌లో దిగాల్సి ఉంది. అయితే, సరిగ్గా అక్కడే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎం.సి. కోటి రెడ్డి కుమారుడు అజిత్ రెడ్డి, ఐపీఎస్ అధికారిణి లక్ష్మి సౌజన్యల వివాహం జరుగుతోందని మోదీ దృష్టికి వచ్చింది. ఈ పెళ్లి కోసం సుమారు 5,000 మంది అతిథులను ఆహ్వానించారు.
24
ప్రధాని తీసుకున్న నిర్ణయం ఇదే
ప్రధాని వస్తున్నారంటే భద్రతా ఏర్పాట్లు చాలా కఠినంగా ఉంటాయి. చివరి నిమిషంలో అక్కడ హెలికాప్టర్ దిగితే, సెక్యూరిటీ కారణాల వల్ల పెళ్లికి వచ్చే వేలాది మంది అతిథులు తీవ్ర ఇబ్బందులు పడతారని ప్రధాని భావించారు. రాజకీయాలో ఏవైనా ఉండొచ్చు, కానీ సామాన్యులకు ఇబ్బంది కలగకూడదని ఆయన డిసైడ్ అయ్యారు. అందుకే తన హెలికాప్టర్ ప్లాన్‌ను క్యాన్సిల్ చేసుకుని, దాదాపు 18 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలోనే ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకున్నారు.
ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. "రాజకీయ విభేదాల కంటే ప్రజల సౌకర్యమే ముఖ్యం" అని నిరూపించిన ప్రధానిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక పక్క వీవీఐపీ ప్రోటోకాల్ ఉన్నా, సామాన్యుల పెళ్లి వేడుక చెడిపోకూడదని మోదీ చూపిన చొరవ ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
34
బెంగళూరులో పీఎం మోదీ పర్యటన వేళ హైఅలెర్ట్
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో కలకలం రేగింది. ప్రధాని వెళ్లాల్సిన మార్గంలో, సభా ప్రాంగణానికి అతి సమీపంలో పేలుడు పదార్థాలను తయారు చేసేందుకు ఉపయోగించే 'జిలెటిన్ స్టిక్స్' లభించడం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో భద్రతా సంస్థలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బెంగళూరులోని కగలిపుర ప్రాంతంలో ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ప్రధాని రాకకు ముందు పోలీసులు, భద్రతా సిబ్బంది సాధారణ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఫుట్‌పాత్ పక్కన రెండు జిలెటిన్ స్టిక్స్ పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వెంటనే బాంబు స్క్వాడ్‌ను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు.
ప్రధాని మోదీ పాల్గొనే ప్రధాన కార్యక్రమం జరిగే ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ జిలెటిన్ స్టిక్స్ లభించాయి. ప్రధాని కాన్వాయ్ వెళ్లే మార్గానికి సమీపంలోనే ఇవి ఉండటంతో సెక్యూరిటీ ఏజెన్సీలు అప్రమత్తం అయ్యాయి. పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా గాలిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తి అసలు వీటిని ఎందుకు అక్కడ పెట్టాడు? దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.