PM Kisan: 21వ విడత డబ్బులు ఎవరికి వస్తాయి? ఎవరికి రావు?

Published : Sep 05, 2025, 07:04 PM IST

పిఎం కిసాన్ పథకం కింద ఇప్పటివరకు 20 విడతలు రైతులకు అందించబడ్డాయి. 21వ విడత కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, కొత్తవారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి వంటి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
పిఎం కిసాన్ 21వ విడత ఎప్పుడు?

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటివరకు 20 విడతల్లో డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడ్డాయి. ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం మూడు సమాన విడతలుగా అందించడం ఈ పథకం ప్రత్యేకత. గత నెలలోనే ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో 20వ విడతగా రూ.20,500 కోట్లు, 9.7 కోట్ల రైతుల ఖాతాలకు జమ చేయబడ్డాయి. ఇప్పుడు అందరూ 21వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

25
పిఎం కిసాన్ యోజన అంటే ఏమిటి?

ఈ పథకాన్ని ఫిబ్రవరి 24, 2019న నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టింది. రైతు కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించి, వారు ప్రశాంతంగా జీవనం సాగించడానికి సహాయపడటమే దీని ఉద్దేశ్యం. అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయం చేసేందుకు పెట్టుబడిసాయంగా సంవత్సరానికి రూ.6,000 అందించబడుతుంది. ఇది మూడు విడతలుగా బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయబడుతుంది.

35
21వ విడత ఎవరికి లభిస్తుంది?

స్వంత భూమి ఉన్న రైతులకే ఈ పథకం ప్రయోజనం లభిస్తుంది. భూమి రైతు పేరు మీద ఫిబ్రవరి 1, 2019 నాటికి నమోదు చేయబడి ఉండాలి. అంతేకాకుండా రైతు బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో అనుసంధానించబడి, NPCIతో సరిగ్గా పనిచేయాలి.

45
21వ విడత ఎవరికి లభించదు?

స్వంత భూమి లేనివారు, కుటుంబంలో ఇప్పటికే ఒకరు పథకం ప్రయోజనం పొందితే, 18 ఏళ్లలోపు వారు, ప్రభుత్వ భూ యజమానులు, NRI లకు ఈ విడత లభించదు. అదేవిధంగా ప్రభుత్వ/ప్రభుత్వ సంస్థ ఉద్యోగులు, అధిక పింఛను పొందుతున్నవారు, గత సంవత్సరం ఆదాయపు పన్ను చెల్లించినవారు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, సీఏ వంటి వృత్తుల్లో ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తించదు.

55
పీఎం కిసాన్ సమాచారం కోసం ఈ వెబ్ సైట్ చూడండి

అర్హులైన రైతులు pmkisan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి "రైతుల విభాగం" ద్వారా నమోదు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు, బ్యాంకు ఖాతాను అనుసంధానిస్తే, పథకం కింద విడతలు వారి ఖాతాలోకి అటోమేటిగ్గా డబ్బులు జమ అవుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories