ఉద్యోగ అవకాశాలు, గ్లోబల్ కంపెనీల రాకతో హైదరాబాద్‌లోని పశ్చిమ భాగం పూర్తిగా మారిపోయింది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, మదాపూర్, రైదుర్గ్ ప్రాంతాలు ఐటీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. గచ్చిబౌలిలో ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు సదుపాయం ఉండటంతో ప్రీమియం నివాసాలకు విపరీతమైన డిమాండ్ ఉంది.
అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో గ్లోబల్ కంపెనీల ఆఫీసులు, బ్యాంకింగ్, ఫిన్‌టెక్, కార్పొరేట్ ఉద్యోగాలు పుట్టకొనడంతో అద్దె ఇళ్లు, ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక హైదరాబాద్ ఐటీ రాజధానిగా పిలిచే హైటెక్ సిటీ, మదాపూర్, రాయదుర్గ్ ప్రాంతాల్లో ఆఫీస్ స్పేస్‌లతో పాటు రెంటల్ డిమాండ్ ఎల్లప్పుడూ పీక్స్‌లోనే ఉంటుంది. కార్పొరేట్ ఉద్యోగులు ఎక్కువగా ఈ ప్రాంతాల చుట్టూనే ఇళ్లను వెతుకుతుంటారు.