హైదరాబాద్ లో 200లకు పైగా పాకిస్తానీలు.. వెనక్కి పంపండి.. అమిత్ షా కీలక ఆదేశాలు

Pahalgam Attack India Reaction: ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన దారుణ ఉగ్రదాడి దేశాన్నే షేక్ చేసి వేసింది. అమాయక పర్యాటకులపై జరిగిన ఈ కాల్పుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడిలో లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ప్రమేయం ఉన్నట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో ఉన్న పాక్ పౌరులందరినీ వెనక్కి పంపించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
 

More than 200 Pakistanis in Hyderabad, Identify All Pakistanis In India, Send Them Back: Amit Shah To all states in telugu rma
India Cancels All Pakistani Visas, Orders Deportation After Pahalgam Terror Attack

Pahalgam Attack India Reaction: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. పాక్ దుశ్చర్యలను తిప్పికొడుతూ తగిన  బుద్ది చెప్పాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన దారుణ ఉగ్రదాడి యావత్ భారతావనిని షేక్ చేసింది. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిగిన ఈ కాల్పుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడికి లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ప్రమేయం ఉన్నట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. దీనికి వెనుక పాకిస్తాన్ హస్తం కూడా ఉందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే పాక్ పై కఠిన చర్యలు తీసుకుంటోంది.

More than 200 Pakistanis in Hyderabad, Identify All Pakistanis In India, Send Them Back: Amit Shah To all states in telugu rma
Send Them Back: Amit Shah Orders States to Deport Pakistani Nationals

ఇప్పటికే పాక్ తో ఉన్న ఒప్పందాను కట్ చేసుకున్న కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే భారత్ లో ఉన్న పాక్ పౌరులందరినీ వెనక్కి పంపించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హోం మంత్రి అమిత్ షా ఇదే విషయంపై స్వయంగా మాట్లాడారు. తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థాన్ పౌరులను గుర్తించి, వారి వివరాలను కేంద్రానికి తెలియజేయాలని, వెంటనే దేశం నుంచి వెనక్కి పంపించేయాలని ఆదేశాలిచ్చారు.


After Pahalgam Massacre, India Launches Diplomatic Crackdown on Pakistan

ఇప్పటికే భారత ప్రభుత్వం పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేసింది. భారత విదేశాంగ శాఖ ఏప్రిల్ 24న విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పాక్ పౌరుల అన్ని రకాల వీసాలు ఏప్రిల్ 27 నుండి రద్దు అవుతాయి. వైద్య వీసాలు కలిగినవారు మాత్రం ఏప్రిల్ 29 వరకు మాత్రమే భారతదేశంలో ఉండే అనుమతి ఉంటుంది.

దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (SAARC) వీసా మినహాయింపు క్రింద దేశంలో ఉన్న పౌరులకు 48 గంటల గడువు ఉంటుంది. ఆ తర్వాత దేశం నుంచి వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేసింది. 

India to Deport All Pakistani Citizens Amid Rising Tensions Over Kashmir Attack

ఇండియాకి విరుద్ధంగా వ్యవహరిస్తే ఏమవుతుందో  చూపించే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. భారత ప్రభుత్వం పాక్‌తో ఉన్న 1960 ఇండస్ వాటర్ ట్రిటీని నిలిపివేసింది.

అలాగే, అటారి ల్యాండ్ ట్రాన్సిట్ పోస్ట్‌ను మూసివేసింది. పాక్ పౌరుల వీసాలను రద్దు చేసింది. పాక్ పౌరులకు ఇకపై దేశంలోకి అనమతి ఉండదనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

No Room for Terror: India Expels Pakistanis Following Pahalgam Attack

హైదరాబాద్ లో 200 మంది పాకిస్తానీలు.. హై అలర్ట్  

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. తాజాగా సమాచారం ప్రకారం.. హైదరాబాద్ నగరంలో 200 మందికి పైగా పాకిస్తాన్ పౌరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. వారిని తిరిగి పాక్ కు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ తో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో పాకిస్తానీలు ఉన్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

Latest Videos

vuukle one pixel image
click me!