తిరుమలలో భద్రత పెంపు :
పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ఆద్యాత్మిక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసారు. ఇలా దేశంలోనే అత్యంత ధనిక ఆలయం, నిత్యం లక్షలాదిమంది భక్తులతో కిటకిటలాడే తిరుమల దేవాలయంలో కూడా భద్రతను పెంచారు. తిరుమల కొండపైకి వెళ్లే వాహనాలను మరింత క్షుణ్ణంగా పరిశీలీస్తున్నారు. తిరుమలలో అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు.
అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు భద్రత కట్టుదిట్టం చేసారు. అలిపిరి టోల్ గేట్, ఘాట్ రోడ్డులో వాహనాల తనిఖీలు ముమ్మరం చేసారు. ఆలయ పరిసరాల్లో ఆక్టోపస్, టిటిడి భద్రతా సిబ్బంది సోదాలు నిర్వహిస్తున్నారు. భక్తుల భద్రత కోసం తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించాయి ఆక్టోపస్ బలగాలు. ఇలా తిరుమల చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటుచేసారు.