Kukatpally Murder Case : కూకట్ పల్లి సహస్ర హత్య వ్యవహారాన్ని మర్చిపోకముందే తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. ఇదే కూకట్ పల్లిలో సొంతింట్లోనే ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి…
Kukatpally Murder Case : పట్టపగలే ఇంట్లోకి చొరబడిన దుండగులు ఓ మహిళను అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 50 ఏళ్ల మహిళను చంపి నగదు, నగలు దోచుకెళ్లారు. హత్య అనంతరం ఆ ఇంట్లోనే స్నానంచేసిన దుండగులు రక్తంతో కూడిన దుస్తులను అక్కడే పడేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన నిన్న (బుధవారం) పట్టపగలే జరిగింది.
25
మహిళను కుక్కర్ తో కొట్టి, గొంతుకోసి చంపిన దుండగులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి స్వన్ లేక్ అపార్ట్మెంట్ లో రేణు అగర్వాల్ కుటుంబంతో కలిసి నివాసముండేది. వీరి కుటుంబం స్టీల్ బిజినెస్ నిర్వహిస్తోంది... రోజూ మాదిరిగానే బుధవారం ఉదయం 10 గంటలకు భర్త, కొడుకు బిజినెస్ పనులపై బయటకు వెళ్ళారు. దీంతో రేణు అగర్వాల్ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. సాయంత్రం భర్త, కొడుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రేణు అగర్వాల్ తీయలేదు... దీంతో అనుమానం వచ్చిన భర్త వెంటనే ఇంటికి వెళ్లాడు.
ఇంటి తలుపులు లాక్ చేసి వుండటంతో స్థానికంగా ఉండే ఓ ప్లంబర్ సాయంతో ఇంట్లోకి వెళ్లారు. కానీ అప్పటికే రేణు రక్తపుమడుగులో పడివుంది. చేతులు, కాళ్లు కట్టేసి, గొంతుకోసిన స్థితిలో ఆమె మృతదేహం పడివుంది. దీంతో వెంటనే భర్త పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
35
రేణు అగర్వాల్ ని ఎందుకు చంపారు?
ఇంట్లోని బంగారు నగలు, నగదు కోసమే రేణు అగర్వాల్ ను హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లోని 40 గ్రాముల బంగారం, లక్ష రూపాయల నగదు కనిపించడంలేదని రేణు భర్త చెబుతున్నారు. దీంతో వీటిగురించి తెలిసినవారే ఈపని చేసివుంటారని అనుమానిస్తున్నారు. ఇటీవలే అగర్వాల్ ఇంట్లో పనికి కుదిరిన హర్ష్, మరో వ్యక్తితో కలిసి రేణును హత్య చేసినట్లుగా ప్రాథమిక నిర్దారణకు వచ్చారు పోలీసులు.
ఓ కోల్ కతా మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా ఇటీవలే హర్ష్ ఈ అగర్వాల్స్ ఇంట్లో పనికి చేరాడు. అతడు ఇదే అపార్ట్మెంట్ లో 14వ అంతస్తులో పనిచేసే రోషన్ తో కలిసి రేణు అగర్వాల్ ను చంపినట్లుగా అనుమానిస్తున్నారు. వీరిద్దరు మధ్యాహ్నం హత్యజరిగిన 13వ అంతస్తులోకి వెళ్లినట్లు... సాయంత్రం 5.02 గంటలకు బయటకు రావడం సిసి కెమెరాల్లో రికార్డయ్యింది. దీంతో ఈ హత్య వీరి పనే అయివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
55
కూకట్ పల్లి హత్య కలకలం
అయితే ప్రస్తుతం హర్ష్, రోషన్ పరారీలో ఉన్నారు. వీరిద్దరూ ఆ అపార్ట్మెంట్ లోని ఓ బైక్ తీసుకుని పరారవుతున్నట్లు సిసి కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఇద్దరు జార్ఖండ్ లోని రాంచికి వెళుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అనుమానితుడు హర్ష్ స్వస్థలం రాంచీనే.. అందుకే అక్కడికి ఓ పోలీస్ టీం వెళ్లింది. ఇక ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు వీరి వివరాలను పంపించారు... వెంటనే పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ టీమ్స్ ఏర్పాటుచేసి గాలింపు చేపడుతున్నారు.