Komuravelli Railway Station: కొమురవెల్లి మల్లన్న భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తుల కోసం నిర్మించిన కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభం కానుంది. రైళ్ల వేళలు, టికెట్ ధరలు సహా ఇతర వివరాలు మీకోసం.
Komuravelli Mallanna:ఇకపై మల్లన్న దర్శనం మరింత ఈజీ
సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులకు ఇక ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. తెలంగాణలో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచే దిశగా కొత్తగా నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ జులై 26న మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా ప్రారంభం కానుంది.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తయిందని, ఇది ఆధ్యాత్మిక పర్యాటకానికి ఎంతో తోడ్పడుతుందని ఆయన తెలిపారు.
25
కొమురవెల్లి రైల్వే స్టేషన్ విశేషాలు, అధునాతన వసతులు
రూ. 5.63 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ స్టేషన్ పనులు ఇప్పటికే 99.5 శాతం పూర్తయ్యాయి. ప్రయాణికుల కోసం ఇక్కడ ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. 450 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు గల హై లెవల్ ప్లాట్‌ఫారమ్‌తో పాటు 5 ప్లాట్‌ఫారమ్ షెల్టర్లను నిర్మించారు.
ప్రయాణికుల వెయిటింగ్ హాల్, టికెట్ బుకింగ్ కౌంటర్, బెంచీలు, సురక్షిత తాగునీటి సదుపాయాలు ఉన్నాయి. మహిళలు, పురుషులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక శౌచాలయాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం విశాలమైన స్థలాన్ని కేటాయించారు.
35
స్థానిక సంస్కృతికి అద్దంపట్టే శిల్పకళ
కొమురవెల్లి రైల్వే స్టేషన్ కేవలం ప్రయాణానికే కాకుండా సాంస్కృతిక ప్రాధాన్యం కు నిలయంగా మారింది. స్టేషన్ గోడలపై కొమురవెల్లి మల్లన్న స్వామి రూపాన్ని, చుట్టుపక్కల ఉండే ప్రకృతి అందాలను తెలిపే అద్భుతమైన మ్యూరల్స్ వేశారు. మన హెరిటేజ్ ప్రతిబింబించేలా దీని డిజైన్ రూపొందించడం విశేషం.
కొత్తగా ప్రారంభమవుతున్న కొమురవెల్లి స్టేషన్‌లో సికింద్రాబాద్ - సిద్దిపేట మార్గంలో నడిచే పలు డెమో రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే హాల్ట్ కల్పించింది. జులై 26 నుంచి ఆగే రైళ్ల సమయాలు ఇవే..
• రైలు నంబరు 77654 (సిద్దిపేట - సికింద్రాబాద్): ప్రతిరోజు మధ్యాహ్నం 2:38 గంటలకు కొమురవెల్లికి చేరుకుంటుంది (బుధవారం మినహా).
• రైలు నంబరు 77655 (సికింద్రాబాద్ - సిద్దిపేట): రాత్రి 8:04 గంటలకు కొమురవెల్లి స్టేషన్‌లో ఆగుతుంది (బుధవారం మినహా).
• రైలు నంబరు 77656 (సిద్దిపేట - సికింద్రాబాద్): ఉదయం 7:04 గంటలకు ఇక్కడ ఆగుతుంది (గురువారం మినహా).
• రైలు నంబరు 77653 (సికింద్రాబాద్ - సిద్దిపేట): మధ్యాహ్నం 12:52 గంటలకు కొమురవెల్లిలో నిలుస్తుంది (బుధవారం మినహా).
55
ఆధ్యాత్మిక పర్యాటకానికి, ఆర్థిక వ్యవస్థకు నెట్ వర్క్ బూస్ట్
కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో లఖడారం-దుద్దెడ స్టేషన్ల మధ్య మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైల్వే లైన్‌లో ఈ స్టేషన్ ఉంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర సమయాల్లో వేలాదిగా వచ్చే భక్తులకు, స్థానిక వ్యాపారులకు, రోజువారీ కూలీలకు ఈ రైలు మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఈ మనోహరాబాద్-కొత్తపల్లి పూర్తి లైన్ అందుబాటులోకి వస్తే వేములవాడ, కొండగట్టు, భీమేశ్వరాలయం, కోటిలింగేశ్వర స్వామి వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలకు డైరెక్ట్ కనెక్టివిటీ లభిస్తుంది.