ఖైర‌తాబాద్ వినాయ‌కుడిని తీసుకెళ్లే ట్ర‌క్ ఎంత స్పీడుతో వెళ్తుంది? డ్రైవ‌ర్‌కి ఎంత జీత‌మిస్తారో తెలుసా?

Published : Sep 24, 2026, 08:00 PM IST

Khairatabad Ganesh: హైదరాబాద్‌లో వినాయక చవితి వేడుకలు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఖైరతాబాద్ బడా గణేష్‌. భారీ విగ్రహాన్ని ఖైరతాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు ఎలా తరలిస్తారు? దాని కోసం ఉపయోగించే టస్కర్‌ ఎంత వేగంతో వెళ్తుంది లాంటి ఆస‌క్తిక‌ర విష‌యాలు

PREV
15
1954లో ఒక్క అడుగుతో మొదలై.. నేడు 69 అడుగులకు

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఏడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. 1954లో స్వాతంత్ర సమరయోధుడు సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో కేవలం ఒక్క అడుగు ఎత్తున్న విగ్రహంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఏటా విగ్రహం ఎత్తును పెంచుతూ వచ్చారు. 2014లో 60 అడుగులకు చేరింది. ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా ఎత్తులో మార్పులు చేశారు. 2024లో 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, 2025లో 69 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2026లోనూ ఖైరతాబాద్ గణపయ్య 69 అడుగుల ఎత్తులో దర్శనమిస్తున్నాడు.

25
దేశవ్యాప్తంగా ఎందుకంత క్రేజ్‌ అంటే..

ఖైరతాబాద్ గణపయ్య అంటే హైదరాబాద్‌కే పరిమితమైన పేరు కాదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ భారీ విగ్రహాన్ని చూసేందుకు వస్తుంటారు. విగ్రహం భారీ పరిమాణం, ప్రతి ఏడాది మారే రూపం, ప్రసిద్ధి చెందిన భారీ లడ్డూ ప్రసాదం ఈ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. 2019లో ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకునేందుకు దాదాపు 40 లక్షల మంది వచ్చినట్లు నమోదైంది. 1954లో చిన్న విగ్రహంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు కాలక్రమంలో హైదరాబాద్ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. పది రోజుల పాటు ఖైరతాబాద్ ప్రాంతం భక్తులతో సందడిగా ఉంటుంది. అనంతరం అనంత చతుర్దశి రోజున భారీ శోభాయాత్రగా గణపయ్యను హుస్సేన్‌సాగర్‌ వైపు తరలిస్తారు.

35
26 టైర్ల టస్కర్‌.. గంటకు కిలోమీటర్ కూడా కాదు!

భారీ గణపయ్యను నిమజ్జనానికి తరలించడం సాధారణ విషయం కాదు. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ టస్కర్‌ను ఉపయోగిస్తారు. ఈ వాహనానికి 26 టైర్లు ఉంటాయి. గతంలోనూ ఖైరతాబాద్ గణపయ్యను 26 టైర్ల భారీ వాహనంపై తరలించినట్లు ట‌స్క‌ర్ డ్రైవ‌ర్ తెలిపారు. ఈ టస్కర్‌ సుమారు 4 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 6 గంటల్లో పూర్తి చేస్తుంది. అంటే లెక్క ప్రకారం గంటకు సగటున కేవలం 0.67 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టే. అంటే సాధారణంగా మనం నడిచే వేగం కంటే కూడా తక్కువ వేగం అన్నమాట. ఇంత నెమ్మదిగా వెళ్లడానికి కారణం కూడా ఉంది. టస్కర్‌పై భారీ గణపయ్య ఉండటంతో ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. రోడ్డుపై విద్యుత్‌ వైర్లు, మలుపులు, ట్రాఫిక్, భక్తుల రద్దీ, విగ్రహం స్థిరత్వం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని వాహనాన్ని నడపాల్సి ఉంటుంది.

45
65 టన్నులు మోయగల టస్కర్‌..

ఈ భారీ టస్కర్‌ను విజయవాడకు చెందిన ఎస్‌టీసీ అనే ట్రాన్స్‌పోర్ట్ సంస్థ అందిస్తోంది. ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం కోసం ఈ టస్కర్‌ను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ వాహనం సుమారు 65 టన్నుల బరువును మోయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. బడా గణేష్ విగ్రహం బరువు సుమారు 40 టన్నులు ఉంటుంది. భారీ విగ్రహాన్ని టస్కర్‌పైకి ఎక్కించడం, దానికి సపోర్టింగ్‌ నిర్మాణాలు ఏర్పాటు చేయడం కూడా ప్రత్యేక ప్రక్రియ.

55
డ్రైవర్‌కు ఎంత జీతం?

ఇక ఈ భారీ ట‌స్క‌ర్‌ను న‌డిపించే డ్రైవ‌ర్ విష‌యానికొస్తే.. గత నాలుగేళ్లుగా వెంకటరెడ్డి ఈ భారీ టస్కర్‌ను నడుపుతున్నారు. ఇంత భారీ విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనాన్ని నడపడం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. అత్యంత తక్కువ వేగంతో, ప్రతి క్షణం అప్రమత్తంగా వాహనాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. ఖైరతాబాద్ బడా గణేష్‌పై భక్తితో టస్కర్‌ను ఉచితంగా అందిస్తున్నట్లే, డ్రైవర్ వెంకటరెడ్డి కూడా ఎలాంటి పారితోషికం తీసుకోకుండా సేవ చేస్తున్న‌ట్లు డ్రైవ‌ర్ తెలిపారు. అంటే ఇంత క్లిష్టమైన ప్రయాణాన్ని చేపడుతున్న ఆయనకు ప్రత్యేకంగా ఎలాంటి జీతం ఇవ్వు. డబ్బు కోసం కాకుండా గణనాథుడిపై ఉన్న భక్తితో ఈ సేవ చేస్తున్నట్లు ఆయ‌న తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories