నాడు ఎడమకాల్వపై, నేడు కృష్ణా ప్రాజెక్టులపై: పోరాటానికి కేసీఆర్ ప్లాన్

First Published | Feb 6, 2024, 2:52 PM IST

ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని భారత రాష్ట్ర సమితి భావిస్తుంది.ఈ మేరకు కృష్ణా జలాల అంశాన్ని  ఆ పార్టీ  అస్త్రంగా ఎంచుకుంది.

నాడు ఎడమకాల్వపై, నేడు కృష్ణా ప్రాజెక్టులపై: పోరాటానికి కేసీఆర్ ప్లాన్

తెలంగాణ రాష్ట్రంలో  అధికారం కోల్పోవడంతో ఆందోళన బాట పట్టనుంది  భారత రాష్ట్ర సమితి.  కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కు ప్రాజెక్టులను  అప్పగించారని తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది.ఈ ఆరోపణలను  తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చుతుంది.  ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఈ నెల  5వ తేదీన మరోసారి స్పష్టం చేశారు. 

also read:ఓటమి తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్ కు కేసీఆర్: కృష్ణా పరివాహక ప్రాంత నేతలతో భేటీ

నాడు ఎడమకాల్వపై, నేడు కృష్ణా ప్రాజెక్టులపై: పోరాటానికి కేసీఆర్ ప్లాన్

కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ అప్పగిస్తే  కలిగే నష్టాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని  భారత రాష్ట్ర సమితి భావిస్తుంది.ఈ విషయమై ఈ నెల  13న  నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావిస్తుంది. తెలంగాణ భవన్ లో  ఇవాళ  నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నేతలతో  కేసీఆర్ సమావేశమయ్యారు. 

also read:నేను రిటైర్ కావడం లేదు: ఏపీ అసెంబ్లీ లాబీల్లో పేర్నినాని, గోరంట్ల మధ్య ఆసక్తికర చర్చ

Latest Videos


నాడు ఎడమకాల్వపై, నేడు కృష్ణా ప్రాజెక్టులపై: పోరాటానికి కేసీఆర్ ప్లాన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కోదాడ నుండి హలియా వరకు  కేసీఆర్ పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం సాగే సమయంలో  నాగార్జున సాగర్ ఎడమ కాలువపై  ఏర్పాటు చేసిన లిఫ్ట్ ల విషయమై  కేసీఆర్  అప్పటి ప్రభుత్వంపై  విమర్శలు చేశారు. 

also read:ఏపీ అసెంబ్లీలో నిరసన, గందరగోళం: టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

నాడు ఎడమకాల్వపై, నేడు కృష్ణా ప్రాజెక్టులపై: పోరాటానికి కేసీఆర్ ప్లాన్

నాగార్జున సాగర్ కుడి కాలువపై ఉన్న లిఫ్టులను ప్రభుత్వమే నిర్వహిస్తుందని, ఎడమకాలువపై  లిఫ్టులను  రైతులే నిర్వహించుకొంటున్నారని అప్పట్లో  కేసీఆర్  ప్రస్తావించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని  నాగార్జున సాగర్ ఎడమకాలువ అంశాన్ని  తీసుకొని అప్పట్లో కేసీఆర్  ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.  

also read:బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్

నాడు ఎడమకాల్వపై, నేడు కృష్ణా ప్రాజెక్టులపై: పోరాటానికి కేసీఆర్ ప్లాన్

 ప్రస్తుతం కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను  తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.ఈ విషయమై  ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆ పార్టీ భావిస్తుంది

also read:పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్:మహబూబాబాద్‌ నుండి అత్యధికంగా ధరఖాస్తులు

నాడు ఎడమకాల్వపై, నేడు కృష్ణా ప్రాజెక్టులపై: పోరాటానికి కేసీఆర్ ప్లాన్

ఈ విషయమై  ఆందోళన కార్యక్రమాలను శ్రీకారం చుట్టనుంది.అసెంబ్లీ వేదికగా కూడ ఈ విషయమై  బీఆర్ఎస్  పోరాటం చేయనుంది. అసెంబ్లీ బయట కూడ ఈ విషయమై  కాంగ్రెస్ తీరును  ప్రజల్లో  విస్తృతంగా  ప్రచారం చేయాలని  బీఆర్ఎస్ భావిస్తుంది.  ఈ మేరకు నల్గొండలో  సభ నిర్వహించనుంది.

also read:మూడు ప్రాంతాల ప్రజలు ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టాలి: చంద్రబాబు

click me!