జనచైతన్య యాత్ర: లాల్ కృష్ణ అద్వానీతో తెలుగు రాష్ట్రాల నేతలు (ఫోటోలు)

First Published | Feb 3, 2024, 3:07 PM IST

దేశంలో బీజేపీని విస్తరించడంలో  అద్వానీ కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేతలు పలువురితో అద్వానీకి సన్నిహిత సంబంధాలున్నాయి.

జనచైతన్య యాత్ర: లాల్ కృష్ణ అద్వానీతో తెలుగు రాష్ట్రాల నేతలు (ఫోటోలు)

బీజేపీ అగ్రనేత అద్వానీతో  మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అప్పట్లో సమావేశమయ్యారు.  వాజ్ పేయ్   మంత్రివర్గంలో  అంతకుముందు దత్తాత్రేయ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ  బలోపేతం కోసం దత్తాత్రేయ కృషి చేశారు. ప్రస్తుతం ఆయన  గవర్నర్ గా కొనసాగుతున్నారు. 

జనచైతన్య యాత్ర: లాల్ కృష్ణ అద్వానీతో తెలుగు రాష్ట్రాల నేతలు (ఫోటోలు)

జనచైతన్య యాత్రలో భాగంగా  లాల్ కృష్ణ అద్వానీతో  మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అప్పట్లో  సమావేశమయ్యారు.  స్థానిక నేతలతో కలిసి  అద్వానీతో  లక్ష్మీనారాయణ అద్వానీతో ఫోటో దిగారు. స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులపై  అద్వానీకి  లక్ష్మీనారాయణ అప్పట్లో వివరించారు. 

జనచైతన్య యాత్ర: లాల్ కృష్ణ అద్వానీతో తెలుగు రాష్ట్రాల నేతలు (ఫోటోలు)

బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీతో మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్ర  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అడుగు పెట్టిన సందర్భంగా  అద్వానీ మీడియా సమావేశంలో ఈ ఇద్దరు నేతలు పాల్గొన్నారు. 

జనచైతన్య యాత్ర: లాల్ కృష్ణ అద్వానీతో తెలుగు రాష్ట్రాల నేతలు (ఫోటోలు)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  బీజేపీలో చెన్నమనేని విద్యాసాగర్ రావు కీలక నేతగా పనిచేశారు.  2014 తర్వాత ఆయన గవర్నర్ పదవిని చేపట్టారు. దీంతో ఆయన క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  వాజ్ పేయ్ కేబినెట్ లో విద్యాసాగర్ రావు  కేంద్ర మంత్రిగా కూడ పనిచేశారు.

జనచైతన్య యాత్ర: లాల్ కృష్ణ అద్వానీతో తెలుగు రాష్ట్రాల నేతలు (ఫోటోలు)

జనచైతన్య యాత్రలో భాగంగా  లాల్ కృష్ణ అద్వానీ యాత్ర  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించిన సమయంలో  ఆయనతో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి  భేటీ అయ్యారు.  

జనచైతన్య యాత్ర: లాల్ కృష్ణ అద్వానీతో తెలుగు రాష్ట్రాల నేతలు (ఫోటోలు)

లాల్ కృష్ణ అద్వానీతో  మాజీ ఎమ్మెల్యే  నల్లు ఇంద్రసేనా రెడ్డి  జనచైతన్య యాత్రలో  భాగంగా  ఏపీ టూర్ కు వచ్చిన సమయంలో భేటీ అయ్యారు.  నల్లు ఇంద్రసేనారెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  బీజేపీ  బలోపేతం కోసం కృషి చేశారు. 

జనచైతన్య యాత్ర: లాల్ కృష్ణ అద్వానీతో తెలుగు రాష్ట్రాల నేతలు (ఫోటోలు)

జనచైతన్య యాత్రలో భాగంగా  లాల్ కృష్ణ అద్వానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించిన సమయంలో  బీజేపీ నేత లక్ష్మణ్ భేటీ అయ్యారు. 

Latest Videos

click me!