జనంలోకి కేసీఆర్: జిల్లాల పర్యటనకు గులాబీ బాస్

First Published | Jan 10, 2024, 3:52 PM IST

భారత రాష్ట్ర సమితి  అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఆరోగ్యం కుదుట పడిన తర్వాత  పార్టీ బలోపేతంపై  కేంద్రీకరించనున్నారు. 

జనంలోకి కేసీఆర్: జిల్లాల పర్యటనకు గులాబీ బాస్

భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి నుండి  రాష్ట్రంలో  పర్యటనలు ప్రారంభించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2023 నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో  జరిగిన ఎన్నికల్లో  భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయింది.  తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత  కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. 

also read:తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు భారీ ఊరట: మూడు కేసుల్లో ముందస్తు బెయిల్

జనంలోకి కేసీఆర్: జిల్లాల పర్యటనకు గులాబీ బాస్

2023 డిసెంబర్  7వ తేదీన రాత్రి  ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  కాలుజారి పడ్డారు. దీంతో  కేసీఆర్ కు గత ఏడాది డిసెంబర్  8వ తేదీన  కేసీఆర్ కు హిప్ రిప్లేస్ మెంట్  సర్జరీ జరిగింది.  ఈ సర్జరీ జరిగిన తర్వాత  కేసీఆర్ తన నివాసంలో  విశ్రాంతి తీసుకుంటున్నారు

also read:కళ్యాణదుర్గం నుండి పోటీ:కాంగ్రెస్‌లోకి కాపు రామచంద్రారెడ్డి?


జనంలోకి కేసీఆర్: జిల్లాల పర్యటనకు గులాబీ బాస్

ఆరోగ్యం కుదుట పడిన తర్వాత  కేసీఆర్  ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో  జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత,మాజీ మంత్రి హరీష్ రావు రెండు రోజుల క్రితం పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. 

also read:మెత్తబడని మాజీ మంత్రి: తెలుగుదేశంలోకి మాజీ మంత్రి పార్థసారథి?

జనంలోకి కేసీఆర్: జిల్లాల పర్యటనకు గులాబీ బాస్

ప్రస్తుతం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా  బీఆర్ఎస్  నాయకత్వం  సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.  ఈ సమీక్ష సమావేశాల తర్వాత  అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించాలని  ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. 

also read:సీఎంఓకు క్యూ: వైఎస్ఆర్‌సీపీ మూడో జాబితాపై జగన్ కసరత్తు

జనంలోకి కేసీఆర్: జిల్లాల పర్యటనకు గులాబీ బాస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత  పార్లమెంట్ ఎన్నికలపై  భారత రాష్ట్ర సమితి ఫోకస్ పెట్టింది.ఈ ఏడాది  ఏప్రిల్ మాసంలో  పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో  రాష్ట్రంలో  మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని  ఆ పార్టీ  భావిస్తుంది.ఈ దిశగా  వ్యూహరచన చేస్తుంది. పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలో  పార్టీ బలాలు, బలహీనతలు, ప్రత్యర్థి పార్టీలు ఎక్కడెక్కడ బలంగా ఉన్నారు, ఆ పార్టీల బలహీనతలు ఏమిటనే విషయమై కూడ భారత రాష్ట్ర సమితి  ఆత్మ పరిశీలన చేసుకుంటుంది. 

also read:మేడిగడ్డ బ్యారేజీపై జ్యుడిషీయల్ విచారణ: హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రేవంత్ సర్కార్ లేఖ

జనంలోకి కేసీఆర్: జిల్లాల పర్యటనకు గులాబీ బాస్

తెలంగాణ రాష్ట్రంలో  ఓటమి తర్వాత  ప్రజల్లోకి వెళ్లేందుకు  కేసీఆర్  రంగం సిద్దం చేసుకుంటున్నారు.  ఫిబ్రవరి  మాసంలో  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు.  పార్లమెంట్ ఎన్నికలకు  పార్టీ క్యాడర్ ను సన్నద్దం చేయనున్నారు.

also read:ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్ 

జనంలోకి కేసీఆర్: జిల్లాల పర్యటనకు గులాబీ బాస్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా  బీఆర్ఎస్ ఓటమి పాలైంది.  తొలిసారిగా బీఆర్ఎస్ విపక్ష పాత్ర పోషిస్తుంది.  తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం  తొలిసారిగా ఏర్పడింది.  కాంగ్రెస్ పార్టీ  ఇచ్చిన  హామీల విషయమై  ఇప్పటికే బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. కేసీఆర్ జిల్లాల పర్యటనలు  చేసే సమయానికి  హామీల అమలు విషయంలో  పురోగతి లేకపోతే  బీఆర్ఎస్ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. 

also read:కేసీఆర్ సహా ఆ ముగ్గురు పార్లమెంట్‌కేనా: బీఆర్ఎస్ వ్యూహం ఏమిటీ?

జనంలోకి కేసీఆర్: జిల్లాల పర్యటనకు గులాబీ బాస్


విపక్షంలో ఉంటే కేసీఆర్ ను  తట్టుకోలేరని  కేటీఆర్ ఇటీవల ప్రకటించారు.  రానున్న రోజుల్లో  ప్రభుత్వంపై  బీఆర్ఎస్ విమర్శల దాడిని తీవ్రతరం చేసే అవకాశం ఉందని ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్ధమౌతుందని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

also read:జిల్లాల బాట పట్టనున్న రేవంత్ రెడ్డి: ఇంద్రవెల్లి నుండి శ్రీకారం

Latest Videos

click me!