కారణమిదీ: స్వంత పార్టీ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు

First Published Jan 8, 2024, 6:37 PM IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు  ప్రస్తుతం స్వంత పార్టీలోనే చర్చకు దారి తీశాయి. 

k kavitha

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  నిజామాబాద్  పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో  చేసిన వ్యాఖ్యలు  చర్చకు దారి తీశాయి. 2014 లో  నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి  భారత రాష్ట్ర సమితి తరపున  కల్వకుంట్ల కవిత  పోటీ చేసి  విజయం సాధించారు.  2019  పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి  ధర్మపురి అరవింద్ చేతిలో బీఆర్ఎస్  అభ్యర్ధి కల్వకుంట్ల కవిత  ఓటమి పాలయ్యారు. 

Kalvakuntla Kavitha, BRS, kavitha


2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా  బీజేపీకి సహకరించిందని  బీఆర్ఎస్  నేతలు విమర్శించారు. మరోవైపు కవిత  ఓటమికి  భారత రాష్ట్ర సమితికి చెందిన కొందరు  నేతలు  నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడ అప్పట్లో వచ్చాయి. 

kavitha

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  నిజామాబాద్  పార్లమెంట్ పరిధిలో దాదాపుగా అన్ని అసెంబ్లీ స్థానాల్లో  భారత రాష్ట్ర సమితి అభ్యర్ధులు విజయం సాధించారు.  కానీ  2023  అసెంబ్లీ ఎన్నికల్లో  ఈ దఫా కేవలం  మూడు స్థానాల్లో మాత్రమే  బీఆర్ఎస్  అభ్యర్థులు విజయం సాధించారు.

kavitha

బీఆర్ఎస్  నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2019లో  తాను ఓటమి పాలు కావడానికి  పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల వైఖరే కారణమని ఇవాళ  జరిగిన సమావేశంలో కల్వకుంట్ల కవిత  పరోక్ష వ్యాఖ్యలు చేశారు.  పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల వైఖరిని మార్చుకోవాలని ఆమె  సూచించారు. 

నిజామాబాద్ జిల్లాల్లో  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  పర్యటించిన సమయంలో  ఆయనను కార్యకర్తలు కలవకుండా స్థానిక ప్రజా ప్రతినిధులు అడ్డంకులు సృష్టించారని  కవిత సమావేశంలో చెప్పారు. తాను  జిల్లాల్లో  పర్యటించిన సమయంలో కూడ  ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయమై  తనకు  ఫిర్యాదులు అందిన విషయాన్ని  కవిత గుర్తు చేశారు.

Kalvakuntla kavitha

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని  ఏడు అసెంబ్లీ స్థానాల్లో  నాలుగు అసెంబ్లీ స్థానాల్లో  బీఆర్ఎస్ ఓటమి పాలైంది. మూడు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది.  మొత్తం  ఏడు అసెంబ్లీ స్థానాల్లో  బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లను చూస్తే  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కంటే  ఎక్కువగా ఉన్నట్టుగా  ఆ పార్టీ నాయకత్వం గుర్తించింది.  ఈ పార్లమెంట్ స్థానంపై  ఫోకస్ పెట్టాలని కవిత  పార్టీ నేతలకు  సూచించారు.
నిజామాబాద్ పట్టణంలోనే తాను ఉంటానని  తనను  ఎవరైనా నేరుగా కలవొచ్చని  కవిత   పార్టీ సమావేశంలో స్పష్టం చేశారు. 


2023 అసెంబ్లీ ఎన్నికల్లో  గజ్వేల్ తో పాటు  కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోటీ చేశారు. కామారెడ్డి  స్థానంలో  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఓటమి పాలయ్యారు.  ఈ స్థానంలో  భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి వెంకటరమణ రెడ్డి విజయం సాధించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి, 2023లో  కామారెడ్డిలో  కేసీఆర్ ఓటమి నేపథ్యంలో  కవిత  ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

d.srinivas

2018 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు  మాజీ ఎంపీ  ధర్మపురి శ్రీనివాస్ పై  చర్యలు తీసుకోవాలని  నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు  కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు.  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ధర్మపురి శ్రీనివాస్ పై నేతలు అప్పట్లో  ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను  ధర్మపురి శ్రీనివాస్ తోసిపుచ్చారు. ఈ విషయమై  కేసీఆర్ ను కలిసి వివరణ ఇచ్చేందుకు  ధర్మపురి శ్రీనివాస్ ప్రయత్నించారు.కానీ, కేసీఆర్ మాత్రం  ధర్మపురి శ్రీనివాస్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. 

click me!