Kavitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయంపై జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ట్వీట్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం తర్వాత మాజీ ఎంపీ కవిత సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎలాంటి నేపథ్యం లేకుండా పరోక్షంగా బీఆర్ఎస్‌ను ఉద్దేశిస్తూ.. “Karma Hits Back !!!” అని రాసుకొచ్చారు. ఇప్పడీ పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించిన తర్వాత కవిత తెలంగాణ జాగృతి పేరుతో ప్రజాకార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
24
కొత్త పార్టీపై జోరుగా సాగుతున్న చర్చ
కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తారనే ఊహాగానాలు ముందే ఉండగా, జూబ్లీహిల్స్ ఫలితాలు ఆమెకు మరింత బలం చేకూర్చాయన్న అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక జూబ్లీహిల్స్ అభ్యర్థి సునీతకు మద్దతుగా కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా విజయం సాధించలేకపోయారు. ఈ ఓటమి కవితకు రాజకీయ ఆయుధంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
34
జనం బాట పేరుతో..
కవిత ఇటీవల జనం బాట పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. అడపాదడపా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూనే బీఆర్ఎస్‌పై కూడా సెటైర్లు వేస్తున్నారు. “ఆడబిడ్డ నాయకత్వం ఎంత బలంగా నిలబడుతుందో చూపిస్తా” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
జనం బాట కార్యక్రమంతో పలు జిల్లాల్లో పర్యటిస్తున్న కవిత దుస్తులు, మాటతీరు, ప్రజలతో మెలగడం—అన్నింటిలోనూ మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు కొత్త రాజకీయ రూపాన్ని సన్నద్ధం చేయడానికి సంకేతంగా భావిస్తున్నారు. మొత్తం మీద కవిత తీరు చూస్తుంటే సొంత కుటుంబ సభ్యులపై తిరుగుబాటు స్పష్టమవుతోంది.