తెలంగాణలో హయ్యెస్ట్ టెంపరేచర్స్..
నేడు తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండిపోతాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా 44-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు... అంటే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారన్నమాట. మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని... అత్యవసరంగా వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇక కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, గద్వాల, వనపర్తి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో 43-44 డిగ్రీల హయ్యెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో 41 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.