ఇవాళ (మార్చి 17, మంగళవారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులు, పిడుగులు తోడవుతాయని... గంటకు 30-40 కిలోమీటర్ల వేగం, గరిష్ఠంగా 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం హెచ్చరించింది.