తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్‌తో సహా ఆ జిల్లాలకు అలర్ట్
అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వానలతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది.
మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే పటాన్‌చెరు, మియాపూర్, కొండాపూర్, ఎల్బీనగర్, బాచుపల్లి వంటి ప్రాంతాల్లో రాత్రి వర్షం దంచికొట్టింది. రాబోయే గంటల్లోనూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.