Published : Nov 13, 2025, 11:27 AM ISTUpdated : Nov 13, 2025, 11:32 AM IST
Telangana Weather Updates : తెలంగాణ చలి తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ శీతాకాలం ఆరంభంలోనే ఈ ప్రాంతాల్లో 7 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి.
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు మరింత పెరుగుతోంది... ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. తెలంగాణలో అయితే తెల్లవారుజామున పొగమంచుతో గడ్డకట్టే చలి ఉంటోంది... శీతాకాలం ఆరంభంలో ఈ పరిస్థితి ఉంటే డిసెంబర్, జనవరి ఇంకెలా ఉంటుందోనని ప్రజలు కంగారుపడిపోతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కోర్ కోల్డ్ వేవ్ జోన్ లో ఉందని... ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుందని కేంద్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలోని National Programme on Climate Change and Human Health (NPCCHH) హెచ్చరించింది. ఇక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
27
తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరికలు
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కారణంగా తెలంగాణలో చలి మరీ ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నార్త్, సెంట్రల్, వెస్ట్ తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయి గడ్డకట్టే స్థాయిలో చలి ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. ఈ జిల్లాల్లో నవంబర్ 13 నుండి 18 వరకు ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతూ కనిష్ట స్థాయికి చేరతాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు 8 నుండి 10 డిగ్రీ సెల్సియస్ మధ్య నమోదవుతాయని వెదర్ మ్యాన్ తెలిపారు. హైదరాబాద్ వెస్ట్, నార్త్, సౌత్ ప్రాంతాల్లో కూడా 11 నుండి 13 డిగ్రీ సెల్సియస్ నమోదవుతాయట.
37
ఇవాళ తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే
ఇవాళ(నవంబర్ 13, గురువారం) నుండి చలిగాలులు మరింత ఊపందుకున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. అత్యల్పంగా కొమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో తెల్లవారుజామున 7.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయినట్లు వెల్లడించారు. అలాగే తిర్యానిలో 8.2 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు.
హైదరాబాద్ విషయానికి వస్తే సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిసరాల్లో అత్యల్పంగా 11.8 డిగ్రీ సెల్సియస్ నమోదైనట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. అలాగే రాజేంద్రనగర్ లో 12.9, మారేడుపల్లిలో 13.6 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యిందట. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలో అయితే ఉదయం 6 గంటల వరకు 11.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్లు తెలిపారు. రాబోయే నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయంటూ తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరికలు చలితో వణికిపోతున్న ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి.
57
హైదరాబాద్ వెదర్ సెంటర్ రిపోర్ట్
అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇవాళ (గురువారం) నమోదైన ఉష్ణోగ్రతలను అధికారికంగా ప్రకటించింది. ఆదిలాబాద్ లో అత్యల్పంగా 10.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. ఇక మెదక్ లో 12, హన్మకొండలో 14, నిజామాబాద్ లో 14.8, రామగుండంలో 15.4, హకీంపేటలో 16.5, దుండిగల్ లో 17, మహబూబ్ నగర్ లో 17.2, ఖమ్మంలో 17.6, నల్గొండలొ 19 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావణ కేంద్రం ప్రకటించింది.
67
హైదరాాబాద్ వాతావరణం
హైదరాబాద్ లొ అత్యల్పంగా పటాన్ చెరు ఈక్రిశాట్ పరిసరాల్లో 12 డిగ్రీ సెల్సియస్ నమోయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక హయత్ నగర్ లో 15, రాజేంద్రనగర్ లో 16.5, బేగంపేటలో 14.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
77
తెల్లవారుజామున జాగ్రత్త...
రాత్రుళ్ల కంటే ఉదయం చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది... కాబట్టి తెల్లవారుజామున వాకింగ్, జాగింగ్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. తెల్లవారుజామునే కాకుండా సూర్యోదయం తర్వాత వ్యాయామం చేసుకోవడం మంచిది. ఇక రాత్రుళ్లు, తెల్లవారుజామున కాకుండా మధ్యాహ్నం సమయంలో ప్రయాణాలు చేయడం మంచిది. ఇంట్లో ముసలివారు, చిన్నపిల్లలు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఉంటే ఈ చలికాలం మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.