Hyderabad: నా త‌ల్లితో, నా భార్య స‌రిగ్గా ఉండ‌డం లేదువిడాకులు ఇవ్వండి.. దిమ్మ‌తిరిగే తీర్పునిచ్చిన కోర్టు

Published : Jan 07, 2026, 01:33 PM IST

Hyderabad: ప్రస్తుతం వైవాహిక బంధాలపై చిన్నచిన్న విభేదాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్ర‌మంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు చర్చనీయాంశంగా మారింది. భార్య వంట చేయడం లేదని విడాకులు కోరిన భ‌ర్త‌కు కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది. 

PREV
15
విడాకుల అప్పీల్‌ను తిరస్కరించిన హైకోర్టు

భార్య తనకు వంట చేయలేదని, అత్త గారితో ఇంటి పనులు పంచుకోలేదని భర్త దాఖలు చేసిన విడాకుల అప్పీల్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కుటుంబ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, ఈ కారణాలు విడాకులకు సరిపోవని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ నగేష్ భీమపాకలతో కూడిన బెంచ్ ఈ తీర్పును వెల్లడించింది.

25
చిన్న గొడవలు విడాకులకు ఆధారం కాదని వ్యాఖ్య

వైవాహిక జీవితంలో చిన్నపాటి చికాకులు, సాధారణ ఒడిదుడుకులు సహజమని కోర్టు పేర్కొంది. అలాంటి కారణాలతో వివాహ బంధాన్ని తెంచుకోవడం సరైనది కాదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. మానసిక క్రూరత్వం అనే పదాన్ని చాలా విస్తృతంగా అర్థం చేసుకోవడం చట్టపరంగా సమంజసం కాదని కూడా స్పష్టం చేశారు.

35
దంపతుల పని పరిస్థితులను పరిశీలించిన ధర్మాసనం

భర్త సికింద్రాబాద్‌కు చెందిన న్యాయ పట్టభద్రుడు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేసి ఆలస్యంగా ఇంటికి వస్తాడు. భార్య ఎల్‌బీ నగర్‌కు చెందిన టెక్నాలజీ ప్రొఫెషనల్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆమె భర్తకు వంట చేయలేకపోవడాన్ని తీవ్రమైన తప్పిదంగా చూడలేమని కోర్టు పేర్కొంది.

45
అత్తతో ఇంటి పనుల అంశంపై కోర్టు స్పష్టత

కోడలు ఇంటి పనులకు సహాయం చేయడం లేదని అత్త చేసే ఆరోపణ మానసిక క్రూరత్వంగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ సమయంలో భర్త స్వయంగా, భార్య గతంలో తన తల్లికి సహాయం చేసిందని అంగీకరించాడని కోర్టు గుర్తు చేసింది. కలిసి ఉన్న సమయంలో కుటుంబ సభ్యులతో ఆమె స్నేహపూర్వకంగా వ్యవహరించినట్టు కూడా నమోదు చేసింది.

55
ఫ్యామిలీ కోర్టు తీర్పునకు మద్ధతు

ఈ జంట 2015లో వివాహం చేసుకుంది. గృహ విభేదాలు, 2017లో జరిగిన గర్భస్రావం తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా 2018 అక్టోబర్ నుంచి విడివిడిగా నివసిస్తున్నారు. గర్భస్రావం అనంతరం భార్య తన తల్లిదండ్రుల ఇంట్లో ఉండటం సహజమని కోర్టు పేర్కొంది. కుటుంబ కోర్టు తీర్పులో ఎలాంటి చట్టవిరుద్ధత లేదని తేల్చి, భర్త అప్పీల్‌ను హైకోర్టు పూర్తిగా తోసిపుచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories