ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు

Published : Jan 06, 2026, 04:17 PM IST

Hyderabad: ఏటీఎమ్‌ల‌ దోపిడి గురించి త‌ర‌చూ వార్త‌ల్లో వింటుంటాం. అయితే తాజాగా హైద‌రాబాద్‌లో ఓ యువ‌కుడు వెరైటీ దోపిడికి దిగాడు. సైబ‌ర్ క్రైమ్‌లో ట్రైనింగ్ తీసుకునేందుకు హైద‌రాబాద్‌కి వ‌చ్చి నేర‌స్థుడిగా మారాడు. 

PREV
15
సైబర్ క్రైమ్ కోర్సు కోసం హైదరాబాద్‌కు వచ్చిన యువకుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన వడ్డె కటమయ్య సైబర్ క్రైమ్‌పై శిక్షణ తీసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్న ఉద్దేశంతో కోర్సు చేయడం ప్రారంభించాడు. అయితే అదే శిక్షణను తప్పుదారి పట్టించి నేరాలకు పాల్పడి పోలీసులకు చిక్కాడు.

25
ఏటీఎంలను టార్గెట్‌

శిక్షణ సమయంలో ఏటీఎంల పని విధానం, వాటిలో ఉన్న సాంకేతిక వ్యవస్థలపై కటమయ్య లోతుగా అధ్యయనం చేశాడు. కొన్ని కంపెనీల ఏటీఎంలలో ఉన్న బలహీనతలను గుర్తించి వాటిని దొంగతనాలకు ఉపయోగించుకున్నాడు అని పోలీసులు తెలిపారు.

35
నగదు బయటకు రాకుండా చేసే ప్రత్యేక పరికరం

నిందితుడు ఏటీఎం లోపల ఒక చిన్న సాంకేతిక పరికరాన్ని అమర్చేవాడు. కస్టమర్ డబ్బులు తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు నగదు బయటకు రాకుండా అది అడ్డుకుంటుంది. డబ్బులు రాలేదని భావించిన కస్టమర్ అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. తరువాత కటమయ్య ఆ పరికరాన్ని తీసి లోపల నిలిచిపోయిన నగదును తీసుకెళ్లేవాడు.

45
మియాపూర్‌లో రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్

ఆదివారం అర్థరాత్రి మియాపూర్ ప్రాంతంలో ఒక ఏటీఎం వద్ద దొంగతనం జరుగుతోందని డయల్ 100కు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డబ్బులు తీస్తున్న సమయంలోనే కటమయ్యను పట్టుకున్నారు. ఈ విషయం మియాపూర్ ఏసీపీ వై. శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు.

55
పరారీలో మరో నిందితుడు

ఈ కేసులో మరో నిందితుడు రామాంజనేయులు పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కటమయ్య గతంలో కూడా ఇలాంటి దొంగతనాల్లో పాల్గొన్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన సైబర్ నేరాల శిక్షణను దుర్వినియోగం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో స్పష్టంగా చూపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories