నెల‌కు రూ. 4.38 కోట్ల అద్దె.. హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ రంగంలో మ‌రో అద్భుతం. ఎక్క‌డో తెలుసా?

Published : Dec 02, 2025, 08:27 AM IST

Hyderabad: హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోంది. అంత‌ర్జాతీయ సంస్థ‌లు హైదారాబాద్ కేంద్రంగా వ్యాపార విస్త‌రణ చేప‌డుతున్నాయి. దీంతో హైద‌రాబాద్ కార్యాల‌యాల అద్దెలు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. తాజాగా జ‌రిగిన ఓ డీల్ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. 

PREV
15
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో భారీ ఒప్పందం

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉన్న గ్రేడ్-A టెక్ పార్క్ స్కైవ్యూ 20లో వీ వ‌ర్క్‌ ఇండియా భారీ స్థలాన్ని లీజ్‌కు తీసుకుంది. మొత్తం 1.75 లక్ష చదరపు అడుగుల కార్యాలయ విస్తీర్ణాన్ని ఐదేళ్ల కాలానికి నెలకు రూ. 1.72 కోట్లు అద్దెతో లీజ్ చేసిందని రిజిస్ట్రేషన్ పత్రాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం మహంగ కమర్షియల్ ప్రాపర్టీస్‌తో నవంబర్ 7న నమోదైంది. లీజ్ సమయంలో వీవ‌ర్క్ రూ. 10.3 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేసింది.

25
JP మోర్గాన్‌కు సబ్-లీజ్

కాగా లీజ్ చేసుకున్న కొన్ని రోజులకే, వీవ‌ర్క్ ఆ స్థ‌లాన్ని JP Morgan Services India Pvt Ltdకు సబ్-లీజ్ ఇచ్చింది. నవంబర్ 13న రిజిస్టర్ అయిన ఈ సబ్-లీజ్ ప్రకారం JP Morgan మొత్తం 1.76 లక్ష చ.అ. స్థలాన్ని నెలకు రూ. 4.38 కోట్లు అద్దెతో తీసుకుంది. అంటే WeWork లీజ్ రేటు (₹98/చ.అ.), JP Morgan సబ్-లీజ్ రేటు (₹249/చ.అ.) మధ్య భారీ వ్యత్యాసం ఉంది. దీనివల్ల WeWork అందించే అధిక ప్రమాణాల ఫిట్-అవుట్స్, ఆధునిక వర్క్‌స్పేస్ డిజైన్ విలువ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేద‌ని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.

35
డెస్కులు, పార్కింగ్ వివ‌రాలు

JP Morgan స్కైవ్యూ 20లో 5వ, 6వ అంతస్తుల్లో 1,501 డెస్కులు ఏర్పాటు చేసుకునేలా ఒప్పందం చేసుకుంది. సంస్థ రూ. 25.9 కోట్ల‌ను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించింది. ఈ ఆఫీస్‌లో 176 కార్ పార్కింగ్‌లు ఉన్నాయి. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మేనేజ్‌డ్ ఆఫీస్‌లను కంపెనీలు పెద్ద ఎత్తున తీసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.

45
ఎక్క‌డుందీ స్కైవ్యూ 20

హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి మార్గంలో మెయిన్ రోడ్డుపై ఉన్న స్కైవ్యూ 20 సమీపంలోనే ప్రముఖ టెక్ క్యాంపస్‌లు ఉండటం, మెట్రో కనెక్టివిటీ, ఆధునిక కార్యాలయ వాతావరణం కారణంగా ఇది మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీల‌కు ఫెవ‌రేట్ ఆప్ష‌న్‌గా మారింది. గత కొంతకాలంగా ఈ క్యాంపస్‌లో అనేక ఆర్థిక సేవల, టెక్నాలజీ సంస్థలు పెద్ద ఎత్తున రెంట్ తీసుకుంటున్నాయి.

55
భారత ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది

Cushman & Wakefield రిపోర్ట్ ప్రకారం, 2025 రెండో త్రైమాసికం నాటికి దేశవ్యాప్తంగా ప్రధాన ఎనిమిది నగరాల్లో మొత్తం 79.7 మిలియన్ చ.అ. ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ ఉంది. ఈ ఏడాది చివరికి ఇది 85 మిలియన్ చ.అకి చేరుకునే అవకాశం ఉంది. 2026లో ఇది 100 మిలియన్ చ.అ. దాటుతుందని అంచనా. ఈ విభాగంలో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా, తరువాత స్థానాల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పుణె, హైద‌రాబాద్‌లు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories