Vegetable Price in Weekend Markets : మీరు ఈ వారాంతం జరిగే సంతలో కూరగాయలు కొనేందుకు సిద్దమవుతున్నారా..? అయితే ఒక్కసారి కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకొండి… సరైన ధరకు కొనుగోలుచేసి డబ్బులు ఆదా చేసుకొండి.
Vegetable Prices : ''అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి''... ఈ సామెత ప్రస్తుతం కూరగాయల ధరలకు సరిగ్గా సరిపోతుంది. రైతులు ఆరుగాలాలు కష్టపడి పండించిన కూరగాయలకు కనీస గిట్టుబాటు ధర ఉండదు.. అవే కూరగాయలను మార్కెట్లో కొంటే చుక్కలు కనిపిస్తాయి. రైతుల వద్ద తక్కువ ధరకే కూరగాయలు కొనే వ్యాపారులు సామాన్య ప్రజలకు ఎక్కువధరకు అమ్ముతారు... దీంతో అటు రైతులు, ఇటు సామాన్య ప్రజలు నష్టపోతున్నారు... వ్యాపారులు మాత్రమే లాభపడుతున్నారు. ఉల్లి రైతుల పరిస్థితే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ... రైతులకు లభించే ధరకు, మార్కెట్లో విక్రయించే ధరకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది.
26
హైదరాబాదీలు... మీకోసమే ఈ సమాచారం
వ్యాపారుల లాభాపేక్షతో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొందరు వ్యాపారులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కూరగాయలను మార్కెట్ ధరకంటే ఎక్కువకు అమ్ముతున్నారు. సాధారణంగా వీకెండ్ మార్కెట్స్ లో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఉద్యోగులు ఈ సమయంలోనే ఎక్కువగా కూరగాయలు కొంటుంటారు. రోజూ వర్క్ బిజీలో ఉండే ఎంప్లాయిస్ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో పట్టించుకోరు... దీన్ని ఆసరాగా చేసుకుని వారికి అధిక ధరలకు అంటగడుతుంటారు.
వీకెండ్ లో మీకు దగ్గర్లో జరిగే కూరగాయల సంతకు వెళ్లేముందు ఓసారి కూరగాయల ధరలు తెలుసుకొండి. వీలైతే నేరుగా రైతుల వద్దే కూరగాయలు కొనేందుకు ప్రయత్నించండి. ఇలా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ద్వారా తగిన ధరకే వాటిని కొనుగోలు చేసే వీలుంటుంది... తద్వారా మీ డబ్బులు ఆదా అవుతాయి. మరి ఈవారం కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
36
కిలో టమాటా ధర ఎంత?
టమాటా... తెలుగువారి వంటింట్లో ఇది తప్పకుండా ఉండాల్సిందే. అందుకే మార్కెట్ కు వెళ్లగానే చాలామంది టమాటా ధరను ఆరా తీస్తుంటారు... వ్యాపారులు కూడా వీటిని కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతుంటారు. అయితే టమాటా ధర ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది... ఓసారి అత్యధిక ధరతో సామాన్యులతో, మరోసారి తక్కువ ధరతో రైతులతో కంటతడి పెట్టిస్తుంది. తాజాగా ఈ ఇద్దరినీ సంతృప్తి పరిచేలా టమాటా ధరలు ఉన్నాయి.
హైదరాబాద్ లో కిలో టమాటా రూ.35 నుండి రూ.45 పలుకుతోంది. గతవారం ఇదే టమాటా కిలో రూ. 30 కి అమ్మారు... వారంలోనే పది పదిహేను రూపాయలు పెరిగింది. దీన్నిబట్టి టమాటా ధర మెళ్లిగా పైపైకి ఎగబాకుతోంది అర్థంమవుతోంది. కాబట్టి వినియోగదారులు ఇప్పుడు వీలైనంత ఎక్కువగా టమాటాలు కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం మంచిది. ఎందుకంటే వచ్చేవారం టమాటా ధర మరింత పెరిగే అవకాశాలున్నాయని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. మార్కెట్ లో కిలో ఉల్లి రూ.20 కి లభిస్తోంది... ఎక్కువగా కొంటే రూ.100 కే ఆరేడు కిలోలు కూడా వస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల వద్ద నేరుగా కొంటే మరింత తక్కువకే ఉల్లిపాయలు లభిస్తాయి. ఇవి ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ఒకేసారి కొనుగోలు చేయవచ్చు. మార్కెట్ లో ఉల్లిపాయల ధర బాగానే ఉన్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు... తీవ్రంగా నష్టపోతున్నారు.
గమనిక : ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.