హైదరాబాద్ చుట్టూ మరో ORR .. రింగు రోడ్డు కాదు రింగు రైలు.. ఇంతకీ ఏమిటీ ప్రాజెక్ట్?

Published : Jul 18, 2025, 05:31 PM IST

హైదరాబాద్ చుట్టూ మరో ఓఆర్ఆర్ వస్తోంది... కానీ ఇది ఔటర్ రింగు రోడ్డు కాదు ఔటర్ రింగు రైలు. ఏమిటీ ప్రాజెక్ట్? దీనివల్ల కలిగే లాభాలేమిటి? ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు..

Outer Ring Rail : హైదరాబాద్ చుట్టూ ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఉంది. మరో రీజనల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణానికి వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఔటర్ రింగ్ రైలు వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు సిద్దమయ్యింది రైల్వే శాఖ. అంటే నగరం చుట్టూ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయనుందన్నమాట... ఇందులోభాగంగా ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఫైనల్ లోకేషన్ సర్వే ప్రక్రియ కూడా పూర్తయ్యింది.

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి ఈ ప్రాజెక్టు గురించి చర్చించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం కలుగుతుంది... కాబట్టి వెంటనే దీనిని రైల్వే శాఖ అనుమతులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. దీంతో ఈ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది.

25
అసలు ఏమిటీ ఔంటర్ రింగు రైలు ప్రాజెక్ట్?

హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది... దీంతో ఇప్పటికే ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోయాయి. భవిష్యత్ లో రవాణా సమస్యలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీన్ని ముందుగానే గుర్తించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జాగ్రత్త పడుతున్నాయి. ఇప్పటికే ఓఆర్ఆర్ కు అవతల వివిధ జిల్లాల మీదుగా రీజనల్ రింగు రోడ్డు నిర్మాణానికి సిద్దమయ్యారు... ఇప్పుడు ఓఆర్ఆర్ కు సమాంతరంగా నగరం చుట్టూ రైల్వే వ్యవస్థను ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టే ఔటర్ రింగ్ రైలు.

35
ఈ ఔటర్ రింగ్ లైన్ వల్ల లాభాలేంటి?

ఔటర్ రింగ్ లైన్ ఏర్పాటుతో హైదరాబాద్ నగర రవాణా కష్టాలు చాలావరకు తగ్గుతాయని భావిస్తున్నారు. అలాగే వివిధ జిల్లాలకు, హైదరాబాద్ కు మద్య రవాణా సదుపాయం మెరుగుపడుతుంది.

వివిధ రైల్వే మార్గాలతో ఈ ఔటర్ రింగ్ రైలు వ్యవస్థను అనుసంధానించనున్నారు. దీంతో ప్యాసింజర్ రైళ్లు కాకుండా గూడ్స్ ట్రైన్స్ ను ఓఆర్ఆర్ గుండా మళ్లించవచ్చు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం తక్కువ అవుతుంది. నగరంలోని రైల్వే స్టేషన్లపై భారం తగ్గుతుంది.

ఎంఎంటీఎస్ రైల్వే వ్యవస్థను శివారు ప్రాంతాలతో మరింత మెరుగ్గా అనుసంధానించవచ్చు. తద్వారా శివారు ప్రాంతాలతో నగరానికి కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది.

ఈ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కాజీపేట, వాడి, డోన్, ముద్ఖేడ్, గుంటూరు, కొత్తపల్లి మార్గాలతో అనుసంధానించనున్నారు. కాబట్టి ఇతర రాష్ట్రాల నుండి నగరానికి వచ్చే రైళ్లు ఓఆర్ఆర్ ను ఉపయోగించుకుని ఈజీగా సికింద్రాబాద్ చేరుకుంటాయి.

45
ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ కలిగిన మొదటి నగరంగా హైదరాబాద్ :

ఈ రింగ్ రైలు ప్రాజెక్ట్ పూర్తయితే దేశంలో ఓఆర్ఆర్ వ్యవస్థ కలిగిన తొలి నగరంగా హైదరబాద్ మారుతుంది. దేశంలో మరే నగరానికి ఇలాంటి ఏర్పాటు లేదు. ఆర్థిక రాజధాని ముంబైలో ప్రధాన రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు శివారు ప్రాంతాల్లో టెర్మినల్స్ ఏర్పాటుచేసారు.. కానీ ఇలాంటి ఔటర్ రింగ్ రైల్ వ్యవస్థ లేదు.

55
ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఎలా సాగనుంది?

2023 లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా ఇప్పటికే ఫైనల్ లోకేషన్ సర్వే పూర్తయ్యింది. దీనిప్రకారం మొత్తం మూడు అలైన్ మెంట్స్ సిద్దం చేాశారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, భువనగిరి, వికారాబాద్, జనగామ, కామారెడ్డి జిల్లాల మీదుగా ఈ రింగ్ రైల్వే ప్రాజెక్ట్ సాగనుంది. ఈ ప్రాజెక్టుకు రూ.12 వేల నుండి 17 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories