Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం

Published : Dec 19, 2025, 09:57 AM IST

Hyderabad: గోవా వెళ్లాల‌ని చాలా మంది కోరుకుంటారు. అక్క‌డి అంద‌మైన బీచ్‌లు, అడ్వెంచ‌ర్ స్పోర్ట్స్ రార‌మ్మంటూ ఆహ్వానిస్తుంటాయి. అయితే అలాంటి వాతావ‌ర‌ణ‌మే హైద‌రాబాద్‌లో ఉంటే ఎలా ఉంటుంది. విన‌డానికి వింత‌గా ఉన్నా హైద‌రాబాద్‌లో నిజంగానే బీచ్ రానుంది. 

PREV
15
సముద్రం లేని నగరంలో బీచ్

సముద్ర తీరానికి వందల కిలోమీటర్లు దూరంలో ఉన్న హైదరాబాదీలు ఇప్పుడు బీచ్ అనుభూతిని పొంద‌నున్నారు. నగర పర్యాటక రంగాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కోత్వాల్‌గూడలో భారీ ఆర్టిఫిషియల్ బీచ్ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం సిద్ధమైంది. గోవా వెళ్లకుండానే అలల శబ్దం, ఇసుక తీరపు ఫీల్ ఇక్కడే అందించడమే ఈ ప్రాజెక్ట్ ల‌క్ష్యం.

25
కోత్వాల్‌గూడలో 35 ఎకరాల మెగా ప్రాజెక్ట్

హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్‌కు సమీపంలో ఉన్న కోత్వాల్‌గూడ ప్రాంతాన్ని ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు. మొత్తం విస్తీర్ణం సుమారు 35 ఎకరాలు. తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్‌లో పనులు జరగనున్నాయి. స్పెయిన్‌కు చెందిన ప్రముఖ ఫ్లూయ డ్రా కంపెనీ, ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ సంస్థ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. అంచనా వ్యయం దాదాపు రూ.350 కోట్లు.

35
10 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ బీచ్ ప్రత్యేక ఆకర్షణ

ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన హైలైట్ 10 ఎకరాల్లో నిర్మించే ఆర్టిఫిషియల్ బీచ్. విదేశాల నుంచి తెప్పించే ప్రత్యేక ఇసుకతో బీచ్ తీరాన్ని రూపొందించనున్నారు. భారీ మాన్‌–మేడ్ లేక్, వేవ్ పూల్స్ ద్వారా నిజమైన సముద్ర అనుభూతి కలిగించేలా డిజైన్ చేస్తున్నారు. నీటి స్వచ్ఛత కోసం అంతర్జాతీయ స్థాయి ప్యూరిఫికేషన్ టెక్నాలజీ వినియోగించనున్నారు.

45
లగ్జరీ స్టే నుంచి అడ్వెంచర్ స్పోర్ట్స్ వరకు

మిగిలిన ప్రాంతంలో లగ్జరీ ప్రైవేట్ విల్లాలు, ఫ్లోటింగ్ విల్లాలు, ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటు చేయనున్నారు. అడ్వెంచర్ ప్రేమికుల కోసం బంజీ జంపింగ్, సేలింగ్, స్కేటింగ్, బీచ్ వాలీబాల్ జోన్లు ఉంటాయి. కుటుంబాలతో వచ్చే సందర్శకులకు పిల్లల ఆటస్థలాలు, సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ఏరియాలు ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఫుడ్ కోర్ట్స్, డెకరేటివ్ ఫౌంటెన్లు, నైట్ ఈవెంట్స్ కోసం ప్రత్యేక స్పేస్ కూడా ప్లాన్‌లో ఉంది.

55
గ్లోబల్ టూరిజం హబ్ దిశగా హైదరాబాద్

ఈ ప్రాజెక్ట్‌ను ఫ్లాగ్‌షిప్ టూరిజం డెవలప్‌మెంట్‌గా ప్రభుత్వం చూస్తోంది. డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటికే పూర్తి చేశారు. మ‌రికొన్ని రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. అంతర్జాతీయ వెల్‌నెస్‌ స్పా రిసార్ట్ మరో ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. ఆయుర్వేద చికిత్సలు, యోగా, ధ్యాన కార్యక్రమాలతో దేశ‌, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఈ బీచ్ టౌన్‌షిప్ రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్త‌యితే హైదరాబాద్ గ్లోబల్ టూరిస్ట్ మ్యాప్‌లో మరో గుర్తింపు పొందడం ఖాయం.

Read more Photos on
click me!

Recommended Stories