Indias largest tunnel aquarium: దేశంలోనే అతి పెద్ద టన్నెల్ అక్వేరియం.. మన హైదరాబాద్ లోనే !

Published : Jun 13, 2025, 12:30 AM IST

Indias largest tunnel aquarium: భారత్‌లోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. మొత్తం 4,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీని నిర్మాణం జరుగుతోంది.

PREV
17
నెహ్రూ జూవలాజికల్ పార్క్ లో అత్యాధునిక టన్నెల్ అక్వేరియం

హైదరాబాద్‌లోని నెహ్రూ జూవలాజికల్ పార్క్ లో త్వరలోనే భారత్‌లోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం రానుంది. ఈ అక్వేరియం సుమారు 4,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇది సందర్శకులకు సముద్ర మట్టం క్రింద నడుస్తున్న అనుభూతిని కలిగించనుంది, శార్క్‌లు, రంగురంగుల చేపలు, వివిధ రకాల సముద్ర జీవులు మధ్యలో నడుస్తూ వాటి అందాలను చూడవచ్చు.

27
హైదరాబాద్ లో అతిపెద్ద టన్నెల్ అక్వేరియం.. రూ. 50 కోట్ల పీపీపీ ప్రాజెక్టు

ఈ ప్రాజెక్టును రూ. 50 కోట్ల వ్యయంతో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (PPP) విధానంలో అభివృద్ధి చేయనున్నారు. సెంట్రల్ జూ అథారిటీ అనుమతి వచ్చిన తర్వాత నిర్మాణం ప్రారంభమవుతుంది. 2026 నాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

37
ఈ టన్నెల్ అక్వేరియంలోకి ప్రపంచ దేశాల అరుదైన జీవులు

ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఖండాలనుండి అరుదైన జలచరాలు ఇందులో ఉండనున్నాయి. అమేజానియన్ ఆరోవానాలు, ఆఫ్రికన్ చిక్లిడ్స్ వంటి ప్రత్యేక జాతుల జీవులు, చేపలు ఈ ఆక్వేరియంలో ఉండే క్లైమేట్ కంట్రోల్డ్ ట్యాంకులలో ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం నెహ్రూ జూ పార్కులో 15 చిన్న అక్వేరియాలు ఉన్నా, ఈ కొత్త ప్రాజెక్టుతో భారతదేశ జలచర ప్రదర్శనలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.

47
ప్రపంచ నిపుణులతో హైదరాబాద్ టన్నెల్ అక్వేరియం డిజైన్

ఈ టన్నెల్ అక్వేరియం డిజైన్‌ను సింగపూర్, ఆస్ట్రేలియాలోని మత్స్య నిపుణులతో కలిసి రూపొందిస్తున్నారు. దేశీయ ఇంజనీర్లు, డిజైనర్లతో కలిసి సైన్స్ సిటీ అహ్మదాబాద్, కేరళలోని మరీన్ వరల్డ్ ప్రాజెక్టుల నుంచి ప్రేరణ తీసుకుంటున్నారు.

57
విద్య, టెక్నాలజీ అనుభూతుల సమ్మేళనంతో టన్నెల్ అక్వేరియం

ఈ అక్వేరియం కేవలం చూడ్డానికి మాత్రమే కాకుండా విద్యా సంబంధిత అనుభవాలను కూడా అందిస్తుంది. విద్యార్థుల కోసం డిజిటల్ గైడ్‌లు, క్యూలేటెడ్ టూర్లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ఫీచర్లు ఏర్పాటు చేయనున్నారు. సముద్ర జీవ వైవిధ్యంపై అవగాహన పెంచే విధంగా ఆకర్షణీయమైన డిజిటల్ అనుభవాలు ఇందులో భాగమవుతాయి.

67
నెహ్రూ జూపార్క్ లో బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ టైగర్ ఎన్‌క్లోజర్

ఈ అక్వేరియం తో పాటు, జూ పార్క్‌లోని పులుల ప్రదర్శనకు బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ ఎన్‌క్లోజర్‌ను రూ. 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. ఇది సందర్శకులు పెద్ద పులులను సురక్షితంగా సమీపం నుంచి వీక్షించేలా చేయనుంది.

77
హైదరాబాద్ టూరిజం

కొత్తగా తీసుకుంటున్న చర్యలతో హైదరాబాద్ నగరానికి టూరిజం, విద్య, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో మరింత ప్రాధాన్యత తీసుకురావడమే కాకుండా, పర్యాటకుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచనున్నాయి. నగరం ఇప్పటికే ఐటీ, బయోటెక్, ఫార్మా, స్టార్ట్‌అప్ రంగాల్లో ముందంజలో ఉంది. ఇప్పుడు ఈ టన్నెల్ అక్వేరియంతో మరింత ప్రగతితో ముందుకు సాగనుంది.

Read more Photos on
click me!

Recommended Stories