Published : Aug 05, 2025, 04:31 PM ISTUpdated : Aug 05, 2025, 04:37 PM IST
Telangana Weather Updates : తెలంగాణవ్యాప్తంగా వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. హైదరాాబాద్ లో అయితే కుండపోత వానలు పడుతున్నాయి. ఇవాళ(మంగళవారం) ఏ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటే…
Hyderabad : తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD)ఇప్పటికే ప్రకటించింది. ఈ వారమంతా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినట్లుగానే సోమవారం (ఆగస్ట్ 4) నగరంలో కుండపోత వాన కురిసింది. ఇవాళ కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి. నిన్నటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వర్షం మొదలయ్యేలోపే సురక్షితప్రాంతాలకు చేరుకోవడం మంచిది.
DID YOU KNOW ?
హైదరాబాద్ లో అత్యధిక వర్షం
సోమవారం హైదరాబాద్ లో అత్యధికంగా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో 151 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఆ తర్వాత బంజారాహిల్స్ లో 124 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది.
27
నిన్నటిలాగే ఇవాళ వాతావరణం...
హైదరాబాద్ లో ఇవాళ(మంగళవారం) ఉదయం నుండి ఉక్కపోత ఎక్కువగా ఉంది. అలాగే సమయం గడుస్తున్నకొద్దీ వాతావరణం మారిపోతూ వస్తోంది. నిన్న(సోమవారం) కూడా సేమ్ ఇలాంటి వాతావరణమే ఉంది... సాయంత్రం మాత్రం కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలో ఇవాళ(మంగళవారం) కూడా సాయంత్రం నగరంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.
37
హైదరాబాద్ కు భారీ వర్షసూచన
హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా శివారుజిల్లాలు మేడ్చల్, రంగారెడ్డిల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందట. అలాగే సైబరాబాద్ ప్రాంతంలోని గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి, కెపిహెచ్బి, మూసాపేట హఫీజ్ పేట్, మియాపూర్, లింగంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంటే హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టే అవకాశాలున్నాయన్నమాట. కాబట్టి నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలి... వర్ష సమయంలో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలి.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కూడా వర్షసూచనలున్నాయట.... ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
57
హైదరాబాద్ లో కుండపోత
సోమవారం కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం అయ్యింది. కొన్నిచోట్ల ఏకంగా 100 మి. మీ కు పైగా వర్షపాతం నమోదయ్యింది... కేవలం రెండుమూడు గంటల్లోనే ఈ స్థాయిలో వర్షం కురవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వర్షపునీటితో రోడ్లు చెరువుల్లా మారాయి... దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది.. కిలోమీటర్ల మేర ట్రాపిక్ జామ్ అయ్యింది.
67
నగరంలో భారీ ట్రాఫిక్ జామ్స్
సాయంత్రం సరిగ్గా ఉద్యోగులు తమ పనులు ముగించుకుని ఇంటికివెళ్లే సమయంలో వర్షం మొదలయ్యింది. రాత్రి వరకు ఈ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో వర్షంలో తడుస్తూనే ఇంటికి పయనమయ్యారు ఉద్యోగులు... కానీ ట్రాఫిక్ జామ్ కారణంగా గంటలతరబడి రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇక లోతట్టు ప్రాంతాల్లో మోకాల్లోతు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు కాదు నడిచి వెళ్ళేందుకు కూడా అవకాశం లేకుండా చేసింది. ఈ సీజన్ ఈస్థాయి వర్షం ఇప్పటివరకు కురవలేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
77
భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు కీలక సూచన
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.... ఇవి మరికొద్ది రోజులు కురుస్తాచయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది... ఈ క్రమంలో కార్పోరేట్, ఐటీ కంపెనీలకు నగర పోలీసులు కీలక సూచన చేస్తున్నారు. భారీవర్షాల సమయంలో తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు. దీంతో రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య తగ్గుతుందని... తద్వారా ట్రాఫిక్ జామ్ కు ఆస్కారం ఉండదని పోలీసులు భావిస్తున్నారు.
ఇక ప్రజలు కూడా వర్షం కురిసే సమయంలో ఇళ్లనుండి బయటకు రావద్దని పోలీసులు, జిహెచ్ఎంసి, హైడ్రా సూచిస్తోంది. ఈ మేరకు ట్రాఫిక్, వర్ష సమాచారాన్ని నగర ప్రజల సెల్ ఫోన్లకు ఎప్పటికప్పుడు మెసేజ్ ద్వారా అందిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను సూచించడంతో వాహనదారులు వేరే మార్గాలను చూసుకుంటున్నారు... ఇలా ట్రాఫిక్ ను టెక్నాలజీ సాయంతో కంట్రోల్ చేస్తున్నారు తెలంగాణ పోలీసులు.