Published : Aug 04, 2025, 08:16 PM ISTUpdated : Aug 04, 2025, 08:20 PM IST
Hyderabad Rainfall Records : హైదరాబాద్ లో సోమవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు వర్షం దంచికొట్టింది. అత్యధికంగా ఎక్కడ, ఎన్ని మిల్లిమీటర్లు కురిసిందో తెలుసా?
Hyderabad Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది… అయితే మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుని ముందుగానే భారీ వర్షసూచనలు ఇచ్చింది. దీంతో నగరవాసులు జాగ్రత్తపడ్డారు... బయట ఉన్నవారు ఆఫీసులు, ఇళ్లు ఇలా సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.
DID YOU KNOW ?
వాళ్లు చెప్పిందే జరుగుతోందిగా
ఈ మూడ్రోజులు (సోమ, మంగళ, బుధవారాలు) తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. చెప్పినట్లుగానే తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి.
26
చినుకుచినుకుగా ప్రారంభమై కుండపోత
అయితే మధ్యాహ్నం హైదరాబాద్ లో చినుకుచినుకుగా ప్రారంభమైన వర్షం కుండపోతగా మారింది. దాదాపు రెండుమూడు గంటలు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో చిన్నపాటి వర్షానికే చెరువులను తలపించే హైదరాబాద్ రోడ్లు వరదనీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరీ దారుణం... మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో నగరవాసులకు అవస్థలు తప్పడంలేదు. అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద రోడ్డుపై భారీగా వర్షపునీరు ప్రవహిస్తోంది... దీంతో వాహనాల రాకపోకలకు కాదు నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి కూడా లేకుండాపోయింది.
36
నగరవ్యాప్తంగా ట్రాఫిక్ జామ్స్
ఇక ఇటు కూకట్ పల్లి, మియాపూర్, హఫీజ్ పేట్, లింగంపల్లి, పటాన్ చెరు.. అటు ఎర్రగడ్డ, అమీర్ పేట్ పంజాగుట్ట, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, నారాయణగూడ, కోఠి, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షపునీరు రోడ్డుపైకి చేరడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి... దీంతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ఇలా తెలుగుతల్లి, నారాయణగూడ, పంజాగుట్ట, బేగంపేట ప్లైఓవర్లపై వాహనాలు నిలిచిపోయాయి.
ఐటీ ఏరియాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సాధారణంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో వర్షం కారణంగా కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఐటీతో పాటు ఇతర కార్యాలయాల ఉద్యోగులు సాయంత్రం ఒక్కసారిగా రోడ్లపైకి రావడం, ఇదే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఇళ్లకు వెళ్లేందుకు రోడ్డెక్కిన ఉద్యోగులు ట్రాఫిక్ లో పడిగాపులు కాస్తున్నారు.
56
అత్యధిక వర్షం కురిసింది ఎక్కడో తెలుసా?
అటు పాతబస్తీ నుండి ఇటు హైటెక్ సిటీ వరకు... సికింద్రాబాద్ నండి సిటీ ఔట్ స్కట్స్ వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కుత్బుల్లాపూర్ లో 151 మిల్లిమీటర్లు, బంజారాహిల్స్ లో 125 మి.మీట వర్షం కురిసింది. ఇక జూబ్లీహిల్స్ లో 74 మి.మీ, మెహదీపట్నంలోబ 53 మి.మీ, ఖైరతాబాద్ లో 36 మి.మీ, మైత్రివనంలో 34 మి.మి, కూకట్ పల్లిలో 30 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. అక్కడక్కడ ఈదురుగాలులు వీయడంతో చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి.
66
గచ్చిబౌలిలో పిడుగుపాటు
గచ్చిబౌలి ప్రాంతంలో భారీ వర్షం, ఈదురుగాలులతో పాటు పిడుగుపడింది. ఖాజాగూడలోని లాంకో హిల్స్ ప్రాంతంలో ఓ తాటిచెట్టుపై పిడుగుపడింది. ఈ పిడుగుపాటు సమయంలో పెద్దశబ్దంతో ఉరమడంతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. గచ్చిబౌలి ప్రాంతంలో అయితే వర్షంలో చెట్టుకు మంటలు కనిపించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.