మరో ఘటనలో మార్చి 24న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కాటేదాన్ ప్రాంతంలో ఉన్న ‘మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ’ అనే అక్రమ ఆహార తయారీ కేంద్రంపై దాడి చేశారు. ఈ కేసులో అఫ్రిది అన్సారీ (22), యాసిన్ (32), ఖత్రేశన్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరు పాడైన గుడ్లు, రసాయనాలు ఉపయోగించి కేకులు, డోనట్ బన్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పాడైన గుడ్లతో కేకులు తయారు చేసి విక్రయం
ఈ యూనిట్‌లో పూర్తిగా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులు సోడియం బెంజోయేట్, సోర్బిక్ యాసిడ్, కాల్షియం ప్రొపియోనేట్, పొటాషియం సోర్బేట్, PGPR లిక్విడ్ వంటి రసాయనాలను ఉపయోగించి పాడైన పదార్థాలను ప్రాసెస్ చేస్తున్నారు. తయారు చేసిన కేకులు, డోనట్ బన్స్‌ను తాజాగా తయారైనవి అన్నట్టు మార్కెట్‌లో విక్రయిస్తూ ముఖ్యంగా పిల్లలను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాడుల్లో 330 పాడైన గుడ్లు, 150 కిలోల కేకులు, డోనట్ బన్స్, పెద్ద మొత్తంలో రసాయనాలు, డాల్డా, పాలు పొడి, సింథటిక్ కలర్స్, ఫ్లేవర్స్, బేకింగ్ యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు
ఈ ఘటనలపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులపై దర్యాప్తు కొనసాగుతోంది. అధికారులు ప్రజలు ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.