Hyderabad: హైదరాబాద్ అంటే కేవలం టూరిజం, ఐటీ రంగాలకు మాత్రమే కాదు రుచులకు కూడా నిలయం. ఇక్కడ గల్లీ గల్లీలో ఒక ప్రత్యేకమైన ఫుడ్ ఐటమ్ మనకు దర్శనమిస్తుంది. అలాంటి వాటిలో ఖైరతాబాద్‌లో కనిపించే చిన్న పూరీలు ఒకటి.
సాధారణంగా మనం హోటళ్లలో పెద్ద పరిమాణంలో ఉండే పూరీలను చూస్తుంటాం. కానీ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో మాత్రం అరచేతిలో ఇమిడిపోయేలా బుజ్జి బుజ్జి పూరీలను వడ్డిస్తారు. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉండే ఈ పూరీలు, తినడానికి కూడా అంతే రుచిగా ఉంటాయి. వేడి వేడి నూనెలో నుంచి అప్పటికప్పుడు తీసి ఇచ్చే ఈ పూరీల కోసమే మెజారిటీ కస్టమర్లు ఇక్కడికి వస్తుంటారు.
25
సరసమైన ధర.. అద్భుతమైన రుచి
నేటి కాలంలో టిఫిన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, ఇక్కడ మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ధర నిర్ణయించారు. కేవలం 30 రూపాయలకే ప్లేట్ నిండా చిన్న చిన్న పూరీలను అందిస్తున్నారు. తక్కువ ధరలో కడుపు నిండా టిఫిన్ దొరుకుతుండటంతో విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారు, స్థానికులు ఈ సెంటర్‌ను అమితంగా ఇష్టపడుతున్నారు.
35
నోరూరించే కూర మరో స్పెషల్
పూరీ రుచి పెరగడానికి కారణం దాంతో పాటు ఇచ్చే ఆలుగడ్డ కూర, చట్నీ. ఈ టిఫిన్ సెంటర్‌లో ఇచ్చే మసాలా కూర పూరీలతో కలిపి తింటే ఆ మజానే వేరు. అందుకే చాలా మంది ఒక ప్లేట్ తిని ఆగకుండా, రెండో ప్లేట్ కూడా ఆర్డర్ చేస్తుంటారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా శుచిగా తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.
ఖైరతాబాద్ కేవలం స్థానికులకే కాకుండా, నగరం నలుమూలల నుంచి వచ్చే వారికి అడ్డాగా మారింది. ఇక్కడి చిన్న పూరీల గురించి సోషల్ మీడియాలో చూసి లేదా స్నేహితుల ద్వారా తెలుసుకొని మరీ దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఉదయం పూట ఇక్కడ రద్దీ చూస్తేనే అర్థమవుతుంది ఈ టిఫిన్ సెంటర్ ఎంత ఫేమస్సో.
55
ఇంతకీ టిఫిన్ సెంటర్ ఎక్కడుంది.?
ఈ ఫేమస్ టిఫిన్ సెంటర్ హైదరాబాద్ ఖైరతాబాద్ మార్కెట్ ప్రాంతంలో ఉంది. ప్రతిరోజూ ఉదయం నుంచే వేడి వేడి టిఫిన్లు ఇక్కడ సిద్ధంగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఆ చిన్న పూరీల రుచి చూడాలనుకుంటే, ఖైరతాబాద్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ స్పాట్‌ను విజిట్ చేయండి.