షాకింగ్... మాజీ సైనికుడి భార్యను విదేశాలకు అమ్మిన హైదరాబాద్ ఏజెంట్లు.. ఆమె ఎలా తప్పించుకుందంటే...

First Published | May 4, 2023, 10:36 AM IST

మానవ అక్రమ రవాణా ముఠా ఓ మాజీ సైనికుడి భార్యను విదేశాలకు అమ్మేసింది. లక్నోకు చెందిన ఆమెకు మంచి ఉద్యోగం ఆశచూపి ఈ దారుణానికి ఒడి గట్టింది. 

హైదరాబాద్ : ఎక్కువ జీతంతో కూడిన ఉద్యోగం ఇప్పిస్తామంటూ గల్ఫ్ దేశాలకు మహిళలను విక్రయిస్తున్నారు హ్యూమన్ ట్రాఫికర్స్.  వీరు ముఖ్యంగా పేద, ఏ ఆధారం లేని మహిళలు, యువతులను టార్గెట్ చేస్తున్నారు. అలాంటి బాధితురాల్లో ఒకరు లలితా సుబ్బా. ఆమె  విధి నిర్వహణలో మరణించిన మాజీ సైనికుడి భార్య. లక్నోకు చెందిన మహిళ. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ట్రావెల్ ఏజెంట్లు అలీ అజ్ఘర్, మహ్మద్ తనను మోసం చేశారని, మస్కట్ వ్యక్తికి రూ. 5 లక్షలకు అమ్మేశారని ఆమె చెప్పింది.

"నేను అక్కడిని వెళ్లగానే ఆ వ్యక్తి నా పాస్‌పోర్ట్, మొబైల్ ఫోన్‌ను లాక్కున్నాడు. అతను, అతని భార్య నన్ను మానసికంగా, శారీరకంగా హింసించేవారు. నేను వారు చెప్పినట్లు వినకపోతే.. ఇనుప రాడ్‌ ను వేడిచేసి దాంతో నన్ను గాయపరిచారు" అని ఆమె చెప్పింది.

అక్కడినుంచి తాను తప్పించుకున్న కథనాన్ని ఇలా గుర్తుచేసుకున్నారు. లలితకు మరో ఇద్దరు బాధితులైన రిజ్వానా  పేరు తెలియని గుజరాత్ మహిళలతో పరిచయం ఏర్పడింది. వీరి ద్వారా ఆమె కొత్త ఫోన్, సిమ్‌ని తీసుకోగలిగాను. "వారు లేనప్పుడు నేను నా పాస్‌పోర్ట్‌ను దక్కించుకున్నాను. వెంటనే మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీని సంప్రదించాను. నా కష్టాలను వివరించాను. దేవుని దయతో, రెండు వారాల్లో, వారు నన్ను భారతదేశానికి తిరిగి పంపించారు" అని ఆమె చెప్పింది.

లక్నోలో తన ఇల్లు కట్టుకోవడానికి డబ్బు సంపాదించాలనుకున్నానని, ఆ క్రమంలో నిందితుడితో పరిచయం ఏర్పడిందని చెప్పింది. మహ్మద్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, దీనికి తాను ప్రతిఘటించడంతో, ఆ ఇద్దరూ కలిసి విలువైన వస్తువులున్న తన బ్యాగ్‌ను దొంగిలించారని, ఆమెను విక్రయించడానికి మస్కట్‌కు చెందిన ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారని.. ఆమె చెప్పింది.


"ఈ సంఘటన 2021లో జరిగింది. అప్పుడు నేను పూర్తిగా డిప్రెషన్‌లో ఉన్నాను. 20 నెలలకు పైగా వేధింపులకు గురయ్యాను. చాలా కష్టంతో నేను దీనిని అధిగమించగలిగాను" అని లలిత చెప్పారు. "ఎంబసీలో ఉన్న రెండు వారాల్లో, నేను వివిధ రాష్ట్రాలకు చెందిన 70 మంది బాధితులను కలిశాను. వారిలో ఏడుగురు హైదరాబాద్‌కు చెందినవారు, మరికొందరు కేరళ, మధ్యప్రదేశ్, ముంబై, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లకు చెందినవారు" అని లలిత చెప్పారు.

పాతబస్తీకి చెందిన మరో బాధితురాలు మహముదా ఖాతూన్ మాట్లాడుతూ, నగరం, జిల్లాల్లోని దిగువ మధ్యతరగతి కుటుంబాల నుండి ఇలాంటి బాధితులు వందలాది మంది ఉన్నారని, వారు మోసపోతున్నారని తెలిపారు. వీరిలో ఎక్కువ మంది కష్టపడి పని చేసే వ్యక్తులు తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని చేసుకునేవారే.. కానీ మాఫియా చేతుల్లో పడి మోసపోయారు, వీరందరినీ మాయమాటలతో గల్ఫ్ దేశాలలో ఉన్నవారికి విక్రయించారు. వారిని పిల్లల్ని చూసుకోవడానికి లేదా ఇంటి సహాయకులుగా నియమించుకుంటారు.

పాతబస్తీకి చెందిన సామాజిక కార్యకర్త రెహానా బేగం మాట్లాడుతూ 20 ఏళ్లలోపు మహిళలు, బాలికలను రూ.40 లక్షలకు విక్రయిస్తుండగా, 20 నుంచి 50 ఏళ్లలోపు వారిని రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షలకు, 50 ఏళ్లు పైబడిన వారు రూ. రూ.5-రూ.10 లక్షలకు అమ్ముతారు. తమ షెల్టర్ హౌస్‌లలో ఉంటున్న బలహీన మహిళలను లక్ష్యంగా చేసుకుని స్థానిక ఎన్‌జిఓలు కూడా మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని బేగం చెప్పారు.

"అవి రహస్యంగా పనిచేస్తాయి, కార్యాలయాలు ఉండవు. లాడ్జీలలో ఉన్నప్పుడు నకిలీ పేర్లు, ఐడీ కార్డులను వాడతాను. దీంతోవారిని పట్టుకోవడం చాలా కష్టం. ఈ ట్రాఫికర్లకు చాలా నెట్‌వర్క్‌ను ఉంటుంది. ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి తమ రహస్య ప్రదేశాలను మారుస్తూ ఉంటారు" అని బేగం చెప్పారు.

లలిత ఉదాహరణలో, ఇద్దరు ట్రావెల్ ఏజెంట్లపై ఫిర్యాదు చేయడానికి లక్నో పోలీసులు నిరాకరించడంతో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె కష్టాలు తీరలేదు. బదులుగా, హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించమని ఆమెను ఆదేశించారు. చివరకు ఏప్రిల్ 26న నాంపల్లి పోలీసులు ఐపీసీ సెక్షన్ 406, 420, 34 కింద కేసు నమోదు చేశారు.

"ఇది నాకో పీడకల. మస్కట్‌లో నేను అత్యంత దారుణమైన నరకం, చిత్రహింసలు, వేధింపులకు గురయ్యాను. దీని వల్ల నేను ఈ రోజు కూడా నిద్రపోలేకపోతున్నాను. ఇప్పుడు, మహ్మద్, అలీ అజ్గర్ నా కాల్‌లకు స్పందించడం లేదు. వారు ఉద్దేశపూర్వకంగా రూ.5 లక్షలు వసూలు చేశారు. నాంపల్లిలోని లాడ్జిలో మహ్మద్‌తో కలిసి రాత్రి గడపడానికి నిరాకరించడంతో నన్ను ఇబ్బందుల్లోకి నెట్టారు’’ అని లలిత చెప్పింది.

లక్నోలో ఇల్లు కట్టుకోవాలని భావించిన లలిత ఇప్పుడు నాంపల్లి రైల్వేస్టేషన్‌లో న్యాయం కోసం ఎదురు చూస్తోంది. ఆమె సామాన్లు ఇంకా ఆమెకు చేరలేదు. ఇందులో చాలావరకు ఆమె జ్ఞాపకాలు, ఆమె తల్లిదండ్రుల ఫోటోలు ఉన్నాయి. దర్యాప్తులో పేరు తెలపడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ: "వారి సిమ్‌ను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తున్నాం. తెలంగాణ మాత్రమే కాకుండా కేరళ, ముంబై తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్ లకు చెందిన నిరుపేద మహిళలకు ఉద్యోగ ఆశచూపి, మోసం, లైంగిక వేధింపులకు పాల్పడడానికి అలవాటు పడ్డారని తెలుస్తోంది"అన్నారు.

లలిత తిరిగి రావడంతో మహ్మద్ మస్కట్‌కు పారిపోయాడని, అలీ అజ్గర్ భారత్‌లో పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. "మాకు వారు దొరికిన తర్వాత, అక్రమ వ్యాపారంలో ఉన్న ఇతర నిందితులను పట్టుకుంటాం. ఏజెంట్లు మానవ అక్రమ రవాణా మాఫియాలో ఒక చిన్న భాగం మాత్రమే. వారు రద్దీగా ఉండే నాంపల్లిలోని లాడ్జీల నుండి పనిచేస్తారు" అని అధికారి చెప్పారు.

విదేశాల్లో ఉద్యోగాల కోసం వచ్చే మహిళల నుంచి లక్షల రూపాయలు వసూలు చేయడమే వీరి పద్దతి అని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వారు మహిళల పట్ల లైంగికంగా అసభ్యంగా ప్రవర్తిస్తారు. వారు నిరాకరిస్తే, బాధితులను హింసించి, ఉద్దేశపూర్వకంగా వేరేవారికి అమ్ముతారని పోలీసులు తెలిపారు.

దీనికి సంబంధించిన మరింత సమాచారం.. 
ట్రావెల్ ఏజెంట్ల ముసుగులో పనిచేస్తున్న 300 మంది మానవ అక్రమ రవాణాదారులు నగరంలో కార్యకలాపాలు సాగిస్తున్నారు.

వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, యువతులను గుర్తించడం, విదేశాలలో మెరుగైన జీవితాన్ని గడపొచ్చని నమ్మించి.. వారి విశ్వాసాన్ని పొందడం.. ఆ తరువాత వారిని పది లక్షల రూపాయలకు విక్రయించడం వారి పనుల్లో భాగం.
 

ఏజెంట్‌లు బాధితుల చిత్రాలను కొనుగోలుదారులకు పంపి, రేటును నిర్ణయించి, వీసాల కోసం వాటిని ఉపయోగించి కేర్‌టేకర్, కుక్ లేదా బేబీ సిటర్‌గా ఉద్యోగాలు పొందాలనే సాకుతో వీరిని పంపుతారు. 
మహిళలు గమ్యస్థానానికి చేరుకోగానే వారి పాస్‌పోర్టులు, ఫోన్‌లు స్వాధీనం చేసుకుంటారు

20 ఏళ్లలోపు మహిళలు, బాలికలను రూ.40 లక్షలకు విక్రయిస్తుండగా, 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షలకు, 50 ఏళ్లు పైబడిన వారు రూ.5-రూ.10 లక్షలకు విక్రయిస్తున్నారు.

ఇంతకుముందు, నగర పోలీసులు విదేశాలకు చెందిన షేక్‌లతో ఒప్పంద వివాహాలను 'ముత్తా' నిషేధించారు. అప్పటి నుంచి ఏజెంట్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.

Latest Videos

click me!