పొంగులేటితో నేడు లంచ్ భేటీ: బీజేపీలోకి ఆహ్వానించనున్న ఈటల

First Published | May 4, 2023, 9:40 AM IST

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో  బీజేపీ  నేతలు  ఇవాళ భేటీ కానున్నారు. బీజేపీలో చేరాలని  ఈటల రాజేందర్ నేతృత్వంలోని కమిటీ ఆహ్వానించనుంది. 
 

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ చర్చలు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ నేతలు  గురువారంనాడు భేటీ కానున్నారు.  మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ  చేరికల కమిటీ  ఇవాళ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  సమావేశం కానున్నారు.  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  నివాసంలో  బీజేపీ నేతల లంచ్ భేటీ  రాజకీయవర్గాల్లో  ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. 

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ చర్చలు


 మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులపై  ఈ ఏడాది ఏప్రిల్  10వ తేదీన  బీఆర్ఎస్  సస్పెన్షన్ వేటు  వేసింది.   దీంతో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీలో  చేరాలని   ఈటల రాజేందర్   బృందం  నేడు  ఖమ్మం  జిల్లాకు  చేరుకోనున్నారు. 


పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ చర్చలు

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో  గత మాసంలో  రాహుల్ టీమ్ చర్చించారు. అయితే  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  10 అసెంబ్లీ  స్థానాల్లో తాను సూచించిన అభ్యర్ధులకు  టిక్కెట్లు కేటాయించాలని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  కోరినట్టుగా  సమాచారం.. అయితే  ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  నుండి  ఎలాంటి స్పందన రాలేదు. ఇవాళ బీజేపీ నేతలు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో భేటీ అయ్యేందుకు  బీజేపీ  నేతలు  వస్తున్నందున  మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ నేతల  బృందం  కూడా  రానుందని  సమాచారం.  ఈ విషయమై  ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ చర్చలు

2024  ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ ను  ఒక్క స్థానంలో కూడా గెలవకుండా చేస్తానని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ప్రకటించారు.  తాను బీఆర్ఎస్ లో  ఉన్న సమయంలో  ఆ పార్టీ నాయకత్వం  తనను అవమానించిందని  ఆయన  విమర్శించారు.  తనకు  ఇచ్చిన హామీలను  కూడ బీఆర్ఎస్ నాయకత్వం  అమలు చేయలేదని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఆరోపించిన విషయం తెలిసిందే.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ చర్చలు

గత నెల  23న  అమిత్ షా సమక్షంలో  పొంగులేటి శ్రీనిాస్ రెడ్డిని బీజేపీలో  చేర్పించేందుకు  ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం  ప్రయత్నించింది. కానీ  ఆ పార్టీ నాయకత్వం  చేసిన  ప్రయత్నాలు  ఫలితం ఇవ్వలేదు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ చర్చలు

త్వరలోనే  ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు  పాదయాత్ర  రూట్ మ్యాప్ కోసం  ఏర్పాట్లు  చేసుకుంటున్నారు.  కర్ణాటక  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తన రాజకీయ భవిష్యత్తును  ప్రకటించే అవకాశం ఉంది.  ఈ లోపుగా  కాంగ్రెస్, బీజేపీ  నాయకత్వాలు  ఇచ్చే ఆఫర్లపై  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తన అనుచరులతో చర్చించే అవకాశం ఉంది.  

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ చర్చలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  బీఆర్ఎస్ గెలుపును నిలవరించేందుకు  తన శక్తిని ధారపోస్తానని ప్రకటించిన  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమ వైపునకు   తిప్పుకొనేందుకు గాను  బీజేపీ, కాంగ్రెస్ లు ప్రయత్నిస్తున్నాయి. 

Latest Videos

click me!