హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం

Published : Dec 14, 2025, 09:38 AM IST

Hyderabad: దిగ్గ‌జ కంపెనీల రాక‌తో ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షిస్తున్న హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం జ‌ర‌గ‌నుంది. న‌గ‌రంలో 72 అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించ‌నున్న‌ట్లు స‌మాచారం. ద‌క్షిణాసియాలోనే అత్యంత ఎత్తైన భ‌వ‌నంగా ఇది నిల‌వ‌నుంది. 

PREV
15
న‌గ‌రంలో సంచలన ప్రాజెక్ట్‌కు సన్నాహాలు

హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్ ప్రాంతంలో 72 అంతస్తుల ఎత్తైన భవన నిర్మాణానికి ఏర్పాట్లు మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే అవసరమైన అనుమతుల కోసం అగ్నిమాపక శాఖను సంప్రదించింది. ఈ వివ‌రాల‌ను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ వెల్లడించారు.

25
దక్షిణాసియాలోనే అత్యంత ఎత్తైన భవనం

ఈ ప్రాజెక్ట్ పూర్తయితే దక్షిణాసియాలోనే అతి ఎత్తైన భవనంగా నిలవనుంది. ప్రస్తుతం ఉన్న రికార్డులను అధిగమిస్తూ హైదరాబాద్ మరో కొత్త గుర్తింపును సాధించనుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇది కీలక మలుపుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బిల్డింగ్ రాక‌తో ఘ‌ట్‌కేస‌ర్‌లో రియ‌ల్ ఎస్టేట్ బూమ్ పెర‌గ‌నుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

35
డాన్సింగ్ డెఫోడైల్ థీమ్‌తో ప్రత్యేక డిజైన్

ఈ భవనాన్ని ‘డాన్సింగ్ డెఫోడైల్’ థీమ్‌తో రూపొందిస్తున్నారు. ప్రతి 30 అంతస్తులకు నిర్మాణ డిజైన్‌లో మార్పులు ఉంటాయి. దూరం నుంచి చూస్తే భవనం స్థిరంగా కనిపించకుండా, గాలిలో మెలికలు తిరుగుతున్నట్టుగా కనిపించేలా డిజైన్ చేస్తున్నారు. ఇది నగర స్కైలైన్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.

45
అగ్నిప్రమాద నివారణకు పటిష్ఠమైన భద్రత

ఈ భారీ భవనంలో అగ్నిప్రమాదాల నివారణ కోసం అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు ప్లాన్‌లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. ఎత్తైన భవనాలకు అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలు పాటించేలా డిజైన్ సిద్ధం చేస్తున్నారని స్పష్టం చేశారు. ‘ఫైర్‌ సెక్యూరిటీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ జాతీయ సదస్సును ప్రారంభించిన డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

55
హైదరాబాద్ విశ్వనగరంగా మరో అడుగు

ఇటీవల తెలంగాణలో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తర్వాత హైదరాబాద్‌పై అంతర్జాతీయ స్థాయిలో దృష్టి పెరిగింది. ఈ 72 అంతస్తుల భవనం నగర అభివృద్ధికి మరో మైలురాయిగా నిలవనుంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరిన్ని భారీ ప్రాజెక్టులు రావచ్చనే అంచనాలు బలపడుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories