IMD Cold Wave Alert: దేశవ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరుగుతోంది. దక్షిణాధి రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఓ రేంజ్‌లో పడిపోతున్నాయి. కాగా వచ్చే రెండు రోజులు తెలంగాణలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది.
దేశంలో చలిగాలుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. హిమాలయ ప్రాంతాలకు సమీపంలోని ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతంలోనూ ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈ శీతల పరిస్థితులు ఇంకా కొన్ని రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
25
పొగమంచు ఎఫెక్ట్.. రవాణాపై ప్రభావం
చలితో పాటు ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉండనుంది. రహదారి రవాణా, రైలు ప్రయాణాలపై ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. వాహనదారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
35
తెలంగాణలో రెండు రోజులు చుక్కలే
తెలంగాణలో రానున్న రెండు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో పొగమంచు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల కంటే దిగువకు పడిపోవచ్చని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అమలులో ఉంది. అదే సమయంలో నేడు 13 జిల్లాలకు, రేపు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని IMD తెలిపింది.
55
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధికారులు కీలక సూచనలు చేశారు. ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండాలని, తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాల, వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తెలిపారు.