ప్రాథమిక విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని తుని, నర్సీపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించినట్లు తేలింది. అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ముంబై, పుణే వంటి నగరాల్లో అధిక ధరలకు విక్రయించాలనే యత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. కిలో గంజాయిని సుమారు రూ.4 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని చెప్పారు.
నలుగురు మహారాష్ట్రకు చెందిన నిందితులు
ఈ కేసులో అరెస్ట్ అయినవారు మహారాష్ట్రకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. నిందితులు గణేష్ శివనాథ్ బోడుగే (42), పరమేశ్వర్ దామోదర్ బాలప్ (33), విన్నీ శైలేష్ మేశారాం (32), ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ (54) గా ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడి వద్ద నుంచి రూ.72,500 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.