స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ... రూ. 16 కోట్ల‌తో హైదరాబాద్ శివారులోని ఈ ప్రాంతానికి కొత్త ఊపు

Published : Jul 22, 2026, 07:04 PM IST

Hyderabad: హైద‌రాబాద్ శివారులోని అమీన్‌పూర్ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. అమీన్‌పూర్‌లో రూ.16.53 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

PREV
14
రూ.16.53 కోట్లతో మౌలిక వసతుల విస్తరణ

అమీన్‌పూర్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. ఈ నిధులతో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD), స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, సెంట్రల్ మీడియన్ నిర్మాణం, శ్మశానవాటిక అభివృద్ధి వంటి కీలక పనులు చేపడతామని చెప్పారు. ఈ పనులు పూర్తయితే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

24
అమీన్‌పూర్‌ను ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దుతాం

అమీన్‌పూర్‌ను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పట్టణంగా అభివృద్ధి చేయడానికి సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను అధికారులు గుర్తించి ప్రతిపాదనలు పంపితే, వాటికి అవసరమైన అదనపు నిధులను కూడా ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

34
సంక్షేమ పథకాల అమలుపైనా దృష్టి

మౌలిక వసతుల అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం సమర్థతంగా అమలు చేస్తోందని మంత్రి చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఎల్‌ఐజీ గృహాల నిర్మాణం వంటి పథకాల లబ్ధి అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

44
తాగునీటి సమస్యపై ముందస్తు చర్యలు

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో తాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది అవసరాలను అంచనా వేసి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అవసరమైతే అదనపు నిధులు కూడా విడుదల చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories