Published : Jul 22, 2026, 12:27 PM ISTUpdated : Jul 22, 2026, 12:49 PM IST
మీ SIR ఫామ్ బిఎల్వో కు అందజేశారా? అయితే వాళ్లు మీ ఓటు మ్యాపింగ్ చేశారో, లేదో తెలియడం లేదా? ఇలాంటి ఓటర్ల కోసమే ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాటు చేసింది… కేేవలం మీ ఫోన్ ద్వారా ఎస్ఐఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
SIR Status Check Tips : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగుతోంది... అదే SIR (Special Intensive Revision). ఇప్పటికే బూత్ లెవెల్ అధికారులు (BLO) ప్రతి ఓటర్ కి ప్రత్యేకంగా SIR ఫామ్స్ అందజేశారు... వాటిని సరైన వివరాలతో నింపి తిరిగి అందించే ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. ఇలా ఆంధ్ర ప్రదేశ్ లో అయితే జూలై 24, తెలంగాణలో అయితే ఆగస్ట్ 3 వరకు ఓటర్లు SIR ఫామ్స్ తిరిగి అందించవచ్చు.
అయితే ఓటర్లు అందించిన వివరాలతో BLO లు ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది... ఇది చాలా కీలకమైన ప్రక్రియ. బిఎల్వోలే ఓటు ఉండాలా, లేదా అనేది నిర్ణయించేది… వాళ్లు వివరాలను అందిస్తేనే ఓటు హక్కు ఉండేది, లేదంటే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మరి మీ బిఎల్వో మీ ఓటు మ్యాపింగ్ చేశారో, లేదో తెలుసుకోవడం ఎలా? ఇందుకోసం ఎలక్షన్ కమీషన్ ఓ ఏర్పాటు చేసింది.
24
మీ SIR స్టేటస్ ని తెలుసుకోండిలా..
ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల సంఘం ఓ ముఖ్యమైన సేవను అందుబాటులోకి తెచ్చింది. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (SIR) స్థితిని తెలుసుకోవడానికి SMS సేవను ప్రారంభించింది. ఈ కొత్త సౌకర్యం ద్వారా భారత పౌరులు ఎవరైనా తమ SIR దరఖాస్తు స్టేటస్ ను ఇంటి నుండే సులభంగా తనిఖీ చేయవచ్చు. ముఖ్యంగా ఇంటర్నెట్ అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల ఓటర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 1950 నంబర్‌కు ఒక సాధారణ SMS పంపడం ద్వారా ఈ సేవను పొందవచ్చు.
SIR స్థితిని తెలుసుకోవడానికి ఓటర్లు కొన్ని సాధారణ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మొదట మీ EPIC (ఎలక్ట్రోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్) నంబర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నుండి 'ECI Space EPIC నంబర్' టైప్ చేసి 1950 అనే నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు మీ EPIC నంబర్ XYZ1234567 అయితే, మీరు 'ECI XYZ1234567' అని టైప్ చేసి 1950 కి ఎస్ఎంఎస్ పంపాలి. వెంటనే మీ దరఖాస్తు స్టేటస్ గురించి ఎన్నికల సంఘం నుండి ఒక ప్రతిస్పందన SMS ద్వారా వస్తుంది. ఇది ఎంతో వేగవంతమైన ప్రక్రియ.
34
ఓటర్ల సేవలను సులభతరం చేయడంలో ఎన్నికల సంఘం కృషి
గ్రామీణ ప్రాంతాలలో నివసించే ఓటర్లకు ఈ ఎస్ఎంఎస్ సేవ నిజమైన వరంగా మారింది. స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే తమ SIR దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. ఓటరు నమోదు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయి. డిజిటల్ అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఓటర్లు తమ హక్కులను సులభంగా వినియోగించుకోవడానికి ఇది గొప్ప మార్గం. ఇది డిజిటల్ అంతరాన్ని తగ్గిస్తుంది.
ఎన్నికల సంఘం నిరంతర కృషిలో భాగంగా ఈ SMS సేవ ప్రారంభమైంది. ఓటర్ల ప్రక్రియలను మరింత సులభతరం చేయడానికి, అందరికీ అందుబాటులో ఉంచడానికి ఈసీ అనేక చర్యలు తీసుకుంటుంది. ఓటరు జాబితాలలో పేరు చేర్చడం, సవరణలు చేయడం వంటి ప్రక్రియలను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇప్పటికే అందిస్తున్నారు. మొబైల్ ఆధారిత సేవలు సాధారణ పౌరులకు చాలా ఉపకరిస్తాయి. ఈ కొత్త SMS సేవ ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవడానికి తోడ్పడుతుంది.
పశ్చిమ బెంగాల్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో SIR ప్రక్రియపై తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్లను తొలగిస్తున్నారనే అపవాదు ఉంది. ఓటర్లు SIR ఫామ్స్ బిఎల్వోలకు అందించినా వారు మ్యాపింగ్ చేయడంలేదని... అందువల్లే లక్షలమంది ఓటు హక్కు కోల్పోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓటర్లు తమ SIR వివరాలను SMS ద్వారా తెలుసుకునే ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమీషన్.
పారదర్శకతను, విశ్వసనీయతను పెంపొందించడంలో ఈ SMS సేవ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఓటర్లు తమ దరఖాస్తు స్థితిని త్వరగా తెలుసుకోవడం ద్వారా వ్యవస్థపై మరింత నమ్మకం ఏర్పడుతుంది. ఇది మరింత మంది ప్రజలను ఓటరుగా నమోదు చేసుకోవడానికి, తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి ప్రోత్సహిస్తుంది.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు సులభంగా తమ SIR సమాచారాన్ని పొందేందుకు కూడా ఈ ఎస్ఎంఎస్ సేవ దోహదపడుతుంది. ఇలాంటి సాంకేతిక పురోగతులు భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి, భవిష్యత్‌లో మరింత సులభతరమైన ఎన్నికల సేవలకు మార్గం సుగమం చేస్తాయి.