భారీవర్షాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
ఈ వర్షాకాలంలో ఇప్పుడే భారీ వానలు మొదలయ్యాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచిస్తోంది. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు కొన్ని జాగ్రత్తలు సూచించింది.
1. వర్ష సమయంలో ఇంట్లోనే ఉండండి. అత్యవసరం అయితేనే వర్షంలో బయటకు వెళ్లాలి.
2. చెట్ల కింద వాహనాలను నిలపడం లేదంటే మీరే నిలబడటం చేయరాదు. చెట్లపైనే పిడుగులు ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి, అంతేకాదు ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
3. వర్షాల సమయంలో రోడ్డుపై నీరు నిలిచివుంటుంది... కాబట్టి గుంతలు కనిపించవు. ఇలాంటి సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడపాలి... లేదంటే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.
4. నదులు, జలాశయాలు, వాగులు వంకలు, చెరువుల పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వరద ప్రవాహంతో ప్రమాదాలు జరుగుతాయి.
5. వాతావరణ శాఖ హెచ్చరికలు ఫాలో అవ్వాలి. భారీ వర్షాల సమయంలో అధికారుల సూచనలు పాటించాలి. అవసరం అయితే ఇంటిని వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి.
6. నగరాలు, పట్టణాల్లో వర్షాల కారణంగా తీవ్ర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతుంటాయి. కాబట్టి ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలి.