Weather Update: దంచికొడుతున్న వానలు.. రాబోయే 3 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు

Published : Oct 18, 2026, 07:05 AM IST

Weather Update: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

PREV
15
ఉపరితల ఆవర్తన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మొదలైన వానలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అలాగే దక్షిణ కోస్తాంధ్ర నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి.

దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

25
ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు.. మత్స్యకారులకు హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్‌పై ఈశాన్య రుతుపవనాల ప్రభావం బలంగా కనిపిస్తోంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో, గరిష్ఠంగా 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారనుందని, కాబట్టి మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి. అలాగే చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

35
తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ.. ఆ జిల్లాలపై ఎక్కువ ప్రభావం

తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి తదితర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈదురుగాలుల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

45
హైదరాబాద్ నగర వాతావరణం.. ప్రయాణికులకు హెచ్చరిక

రాజధాని హైదరాబాద్‌లో ఉదయం పూట స్వల్పంగా చలిగాలులు, పొగమంచు వాతావరణం కనిపిస్తుండగా, మధ్యాహ్న సమయానికి ఎండ తీవ్రతతో ఉష్ణోగ్రతలు సుమారు 32 డిగ్రీల నుంచి 33 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. అయితే మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఎల్బీనగర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది.

వర్షం కారణంగా రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే ప్రమాదం ఉన్నందున వాహనదారులు ప్రయాణ సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు పిడుగుపాటు ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి చెట్లు, భారీ హోర్డింగ్‌ల కింద నిలబడవద్దని విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది.

55
అన్నదాతలకు వాతావరణ శాఖ కీలక సూచనలు

ప్రస్తుతం చాలా ప్రాంతాలలో పంటలు కోత దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు కూడా తోడుడనున్నాయి.

కాబట్టి రైతులు తమ కోతకొచ్చిన పంటలను, ధాన్యాన్ని తడవకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని లేదా టార్పాలిన్లు కప్పి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు. పొలాల్లో పనిచేసే సమయంలో ఉరుములు మెరుపులు కనిపించగానే వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories