Hyderabad : హైదరాబాద్‌లో అంతరిక్షం నుండి కనిపించేంత భారీ చెత్తకొండలా..! ఎక్కడున్నాయో తెలుసా?

Published : Oct 16, 2026, 11:39 AM ISTUpdated : Oct 16, 2026, 11:54 AM IST

హైదరాబాద్ అనగానే అభివృద్ధిలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు గుర్తుకువస్తాయి. కానీ నగరానికి మరోవైపు అంతరిక్షం నుండి కనిపించేంత పెద్ద చెత్తకొండలు ఉన్నాయని తెెలుసా?

PREV
14
ఇండియాలోనే అతిపెద్ద డంప్ యార్డ్ హైదరాబాద్ లోనే ఉందా..!

హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలు, ఐటీ కంపెనీలు, ఔటర్ రింగ్ రోడ్డు మాత్రమే కాదు.. నగరానికి మరోవైపు భారీ చెత్తకొండలు కూడా దాగివున్నాయి. నగరంలో ప్రతిరోజూ ఉత్పత్తయ్యే చెత్తను దశాబ్దాలుగా ఒకే ప్రాంతంలో వేస్తున్నారు... దీంతో వేల టన్నుల చెత్త కొండల మాదిరిగా పేరుకుపోయింది. ఇలా చెత్తకొండలతో దుర్గంధాన్ని వెదజల్లుతూ పూర్తిగా కాలుష్యభరితమైన ప్రదేశమే జవహర్‌నగర్‌ డంప్‌యార్డ్‌.

జవహర్ నగర్ లో పోగుపడిన వ్యర్థాలు కొండలను తలపిస్తుండగా, వాటి నుంచి వెలువడే మీథేన్‌ వాయువు పర్యావరణంపై ఆందోళన కలిగిస్తోంది. అంతరిక్షం నుంచి కూడా ఈ చెత్త ప్రాంతం కనిపిస్తుందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ డంప్ యార్డ్ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరమే కాదు భూమిలోపలి జలాలు కూడా కలుషితం అవుతున్నాయి. అసలు ఈ డంప్‌యార్డ్‌ ఎక్కడ ఉంది? ఇక్కడ ఎంత చెత్త పేరుకుపోయింది? పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉంది? అనే విషయాలను తెలుసుకుందాం.

24
హైదరాబాద్ ఎక్కడుంది ఈ చెత్తకొండ?

హైదరాబాద్‌ శివారులోని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలోని జవహర్‌నగర్‌ ప్రాంతంలో ఈ డంప్‌యార్డ్‌ ఉంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల నుంచి ప్రతిరోజు సేకరించే చెత్తలో భారీ భాగాన్ని ఇక్కడకే తరలిస్తారు. దశాబ్దాలుగా (దాదాపు 30 ఏళ్లుగా) నగరంలోని వ్యర్థాలన్నీ చేరుతుండటంతో ఈ ప్రాంతంలో భారీగా చెత్త పేరుకుపోయింది. విస్తీర్ణం, వ్యర్థాల పరిమాణం కారణంగా ఇది నగరంలోని ప్రధాన పర్యావరణ సమస్యల్లో ఒకటిగా మారింది.

అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం... జవహర్‌నగర్‌ డంప్‌యార్డ్‌ సుమారు 340 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడికి ప్రతిరోజు దాదాపు 8,100 టన్నుల చెత్త చేరుతుందని అంచనా. అంటే సగటున ప్రతి 10 సెకన్లకు ఒక టన్ను చెత్త వస్తుందన్నమాట. ఇంత పెద్ద మొత్తంలో వ్యర్థాలు నిరంతరం పేరుకుపోవడంతో చెత్త గుట్టలుగుట్టలుగా, భారీ కొండల మాదిరిగా కనిపిస్తాయి.

34
ప్రపంచంలోనే నాలుగో స్థానం..

ప్రపంచవ్యాప్తంగా చెత్త డంప్‌యార్డుల నుంచి వెలువడే మీథేన్‌ ఉద్గారాలను ఉపగ్రహాల సాయంతో పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌ డంప్‌యార్డ్‌ కూడా చర్చలోకి వచ్చింది. కొన్ని రిపోర్ట్స్ లో మీథేన్‌ ఉద్గారాల పరంగా ఇది ప్రపంచంలోని ప్రధాన చెత్త నిల్వ కేంద్రాల్లో ఒకటిగా పేర్కొంటున్నారు. అర్జెంటినా, జకార్తా, కౌలాలంపూర్ లోని డంప్ యార్ట్స్ తర్వాత స్థానం హైదరాబాద్ దే... అంటే ప్రపంచంలో నాలుగోస్థానం అన్నమాట. ఇండియాలో అయితే ఇదే టాప్.

మీథేన్‌ విడుదలతో పర్యావరణానికి ముప్పు

చెత్తలోని ఆహార వ్యర్థాలు, ఇతర సేంద్రియ పదార్థాలు కుళ్లినప్పుడు మీథేన్‌ వంటి వాయువులు విడుదలవుతాయి. మీథేన్‌ శక్తివంతమైన గ్రీన్‌హౌస్‌ వాయువు కావడంతో వాతావరణ మార్పులకు కారణమవుతుంది. డంప్‌యార్డ్‌లో వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోతే దుర్వాసన, గాలి కాలుష్యం, మంటలు చెలరేగే ప్రమాదం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. జవహర్‌నగర్‌ డంప్‌యార్డ్‌ నుంచి గంటకు సుమారు 5.9 టన్నుల మీథేన్‌ విడుదలవుతోందని కొన్ని రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి… ఇది చాలా ప్రమాదకరమైన విషయం.

44
భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉంది?

జవహర్‌నగర్‌తో పాటు దమ్మాయిగూడ, నాగారం వంటి సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలకు భూగర్భ జలాల నాణ్యతపై ఆందోళన నెలకొంది. చెత్త నుంచి వెలువడే కలుషిత ద్రవం (లీచేట్‌) భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. అయితే ఆయా ప్రాంతాల్లో నీరు కలుషితమైందని నిర్ధారించాలంటే బోరు నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించాలి.

మొత్తంగా.. జవహర్‌నగర్‌ డంప్‌యార్డ్‌ హైదరాబాద్‌ వ్యర్థాల నిర్వహణలో కీలకమైన ప్రదేశం. ఇక్కడ పేరుకుపోతున్న చెత్తను శాస్త్రీయంగా నిర్వహించడం, మీథేన్‌ ఉద్గారాలను నియంత్రించడం, పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించడం ఎంతో ముఖ్యం.

Read more Photos on
click me!

Recommended Stories