Anvesh on HCU issue
హెచ్‌సీయూ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ అంశంపై స్పందిస్తుండడంతో సోషల్ మీడియా వేదికగా 'సేవ్ హెచ్‌సీయూ' పేరుతో పెద్ద ఎత్తు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ అంశంపై పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ సైతం హెచ్‌సీయూపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు
Anvesh
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పని సరైందేనని చెప్పిన అన్వేష్.. 400 ఎకరాల భూమిని చదును చేసి రూ. 50 వేల కోట్ల ఆస్తిని సృష్టిస్తున్నారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ నిర్ణయాన్ని మద్ధతిస్తూనే అన్వేష్ ఒక ఆసక్తికరమై కథను తన వీడియో ద్వారా పంచుకున్నారు. ప్రముఖ హాలీవుడ్ మూవీ అవతార్‌ను, హెచ్‌సీయూను పోల్చుతూ అన్వేష్ వివరించారు. విలువైన ఖనిజాన్ని దోచుకుకోవడానికి పండారా గ్రహంపైకి వెళ్లిన మనుషులపై అక్కడి తెగ తిరగడడమే అవతార్ కథ సారాంశం.
ఇప్పుడు హెచ్‌సీయూలో ఉన్న జీవులతో పాటు ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరు చేస్తున్నారని అన్వేష్ తన వీడియోలో తెలిపారు. ఒకవేళ జంతువులకు మాటల వస్తే మా భూముల్లోకి ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తారన్నాడు. అవతార్ సినిమా, హెచ్‌సీయూలో జరుగుతోన్న ఘటనకు దగ్గరి పోలికలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. రేవంత్ రెడ్డి వృత్తి ధర్మంగా తన పని తాను చేస్తున్నారని కానీ మనిషిగా మాత్రం తాను చేస్తున్న పని తప్పని అన్వేష్ అభిప్రాయపడ్డాడు.
రోజురోజుకీ పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా చెట్లు కచ్చితంగా ఉండాలన్నాడు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం సరైందేనని కానీ ప్రకృతి సంపదను నాశనం చేస్తూ చేయడం మంచిది కాదని తెలిపాడు. హైదరాబాద్‌కు ఊపిరితిత్తుల్లాంటి హెచ్‌సీయూ అడవులను నరకడం ఒక మనిషిగా రేవంత్ రెడ్డి చేస్తుంది తప్పని అన్వేష్ అభిప్రాయపడ్డాడు.
HCU Lands
ప్రకృతి విరుద్ధంగా ఏ పని చేసినా అది మంచిది కాదని అన్వేష్ చెప్పుకొచ్చాడు. ఏదైనా పని చేసేప్పుడు ఆటంకం ఏర్పడితే ఆ పని చేయకూడదని ప్రకృతి మనకు ఒక సందేశం ఇస్తుందని, వెంటనే ఆ పనిని ఆపేయాలన్నాడు. రేవంత్ రెడ్డి చేసే ఈ పని ఆయన కుటుంబానికి కూడా మంచిది కాదంటూ అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రకృతి వినాశనం మానవ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయాలను కూడా అన్వేష్ తన వీడియోలో ప్రస్తావించారు. అన్వేష్ మాట్లాడిన పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.