Ration Card: ఏప్రిల్ 30 లోపు ఇలా చేయకపోతే.. మీ రేషన్ కట్ అవుతుంది. గడువు పొడిగించిన ప్రభుత్వం..

Published : Apr 01, 2025, 04:25 PM IST

పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారికి ఆహార భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలో ఆహార పదార్థాలను అందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి తర్వాత కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు దారులందరికీ ఉచితంగా బియ్యం అందిస్తోంది. ఈ క్రమంలోనే రేషన్ కార్డు ఉన్న వారంతా కేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. మార్చి నెలతో ఈ గడువు ముగియగా తాజాగా మళ్లీ పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. 

PREV
15
Ration Card: ఏప్రిల్ 30 లోపు ఇలా చేయకపోతే.. మీ రేషన్ కట్ అవుతుంది. గడువు పొడిగించిన ప్రభుత్వం..

రేషన్ పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం.. రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ ప్రక్రియ తప్పనిసరి అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ గడువును పలుసార్లు పొడగిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి పొడగించింది. ఇది వరకు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి 2025 మార్చి 31ని చివరి తేదీగా ప్రకటించారు. అయితే ఇప్పటికీ కొంత మంది ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో ఈ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడగించారు.

ఈ కేవైసీ అనేది డిజిటల్ వెరిఫికేషన్ పద్ధతి. ఈ ప్రాసెస్ పూర్తి చేయని వాళ్లు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) ఆహార ధాన్యాల రాయితీలను పొందలేరు. e-KYC విధానంలో మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డును లింక్ చేస్తారు. 

25

రేషన్ కార్డ్ e-KYC అంటే ఏమిటి?

రేషన్ కార్డుదారుల కోసం, e-KYC (ఎలక్ట్రానిక్ - నో యువర్ కస్టమర్) అనేది వారి గుర్తింపును ధృవీకరించడానికి ఆధార్ కార్డును రేషన్ కార్డుతో లింక్ చేయడం. పథకాలు అర్హులకే లభించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను చేపట్టారు. 

35

రేషన్ కార్డ్ e-KYC ఎందుకు అవసరం.?

పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద రాయితీ ధరలో లభించే ఆహార ధాన్యాల లభ్యతను ఇది నిర్ధారిస్తుంది.

వినియోగదారులు నిజమైనవారని నిర్ధారించడం ద్వారా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇది సహాయపడుతుంది.

కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయకపోతే సదరు వ్యక్తి ఆ పథకానికి అనర్హుడిగా గుర్తిస్తారు. 

45

రేషన్ కార్డ్ e-KYC: ఆన్‌లైన్‌లో పూర్తి చేయడానికి స్టెప్స్

స్టెప్ 1

రాష్ట్ర PDS వెబ్‌సైట్‌కి వెళ్లండి: మీ రాష్ట్ర పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) అధికారిక సైట్‌ను ఓపెన్ చేయండి. 

స్టెప్ 2

హోమ్ పేజీలో కనిపించే సర్వీసులు లేదా రేషన్ కార్డు మెను కింద కనిపించే "e-KYC ఫర్ రేషన్ కార్డ్ " ఆప్షన్ క్లిక్ చేయాలి. 

స్టెప్ 3

తప్పనిసరి సమాచారాన్ని ఎంటర్ చేయండి:

మీ రేషన్ కార్డ్ నంబర్‌ను ఇవ్వండి.

తర్వాత కుటుంబ పెద్ద లేదా సంబంధిత సభ్యుని ఆధార్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

స్టెప్ 4

మీ మొబైల్ నంబర్‌ను వెరిఫై చేయండి:

ఇందుకోసం ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను ఉపయోగించండి.

లాగిన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి ఫోన్ కు వచ్చిన వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను (OTP) ఎంటర్ చేయండి.

వెరిఫికేషన్ కోసం సబ్మిట్ చేయండి. వెరిఫై చేసిన తర్వాత, సమాచారాన్ని ఎంటర్ చేయండి. e-KYC విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

55

ఇప్పటికే ఈ కేవైసీ గడువును ప్రభుత్వం పలుసార్లు పొడగిస్తూ వచ్చింది. అయితే తాజాగా మార్చి 31వ తేదీతో గడువు ముగియగా.. ఇంకా కొంత మంది కేవైసీ పూర్తి చేయలేదని అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరో నెల రోజుల పాటు గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఏప్రిల్ 30లోపు ఈ కేవైసీ చేయించకపోతే మీ రేషన్ నిలిచేపోయే అవకాశం ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories