Holiday : ఈ నెలలో సెలవులే సెలవులు ... నాలుగు వారాల్లో మూడు లాంగ్ వీకెండ్సే

Holidays in April 2025 : సెలవులతో ప్రారంభమైన ఈ ఏప్రిల్ నెల సెలవులతో ముగియనుంది. ఈ నెలలో వచ్చే సెలవుల లిస్ట్ కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.  

April 2025 Holidays: Multiple Long Weekends and Summer Break for Students in telugu akp
School Holidays

School Holiday : ఈ విద్యా సంవత్సరం ముగియడానికి కేవలం ఇంకో నెలరోజులు మాత్రమే మిగిలివుంది. ఏప్రిల్ చివరినాటికి విద్యార్థులందరికి పరీక్షలు పూర్తయి వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి. ఇలా నెలరోజులకు పైగా వచ్చే ఈ సమ్మర్ హాలిడేస్ లో విద్యార్థులు తెగ ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సెలవులకంటే ముందు విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టాల్సి ఉంటుంది... బాగా చదువుకుని పరీక్ష రాస్తేనే మంచిమార్కులు వచ్చేది. ఇలా బయట సమ్మర్ హీట్ కు తోడు ఈ చదువు గోలతో విద్యార్థుల మైండ్ కూడా హీటెక్కిపోతుంది. అయితే ఈ ఒత్తిడినుండి కాస్త ఉపశమనం కలిగించేలా ఈ నెలలో చాలా సెలవులు వస్తున్నాయి. 

విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ ఏప్రిల్ లో సెలవులే సెలవులు వస్తున్నాయి... మరీముఖ్యంగా రెండుమూడు లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. ఇలా సెలవులు వీకెండ్ తో కలిసిరావడంతో ఉద్యోగులు ఎగిరి గంతేసే విషయమే. ఈ లాంగ్ వీకెండ్స్ లో భగభగమండుతున్న సూర్యుడి వేడినుండి బయటపడేందుకు చల్లని ప్రాంతాలకు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. పరీక్షలు ముగిసాక పిల్లలతో కలిసి హాయిగా గడిపి రిప్రెష్ కావచ్చు. 
 

April 2025 holidays

ఏప్రిల్ లో వచ్చే సెలవులివే : 

తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 2025 లో ఐదు సాధారణ సెలవులు, మూడు ఐచ్చిక  సెలవులు వస్తున్నాయి.  వీటికి నాలుగు ఆదివారాలు, నెలాకరున ప్రారంభమయ్యే సమ్మర్ హాలిడేస్ తోడవుతాయి.  దీంతో ఈ నెలలో విద్యాసంస్థలు నడిచేది చాలా తక్కువరోజులు... అది కూడా ఒంటిపూటే. పరీక్షల నెల ఏప్రిల్ లో వచ్చే సెలవులు విద్యార్థులు మరింత ఎక్కువగా చదువుకునేందుకు ఉపయోగపడతాయి. పరీక్షలు ముగిసాక వచ్చే సెలవులు ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు ఉపయోగపడతాయి. 

గత మార్చి నెల సెలవులో ముగియగా ఏప్రిల్ కూడా సెలవులతోనే ప్రారంభమయ్యింది. ఉగాది, రంజాన్ పండగలకు సెలవులిచ్చిన ప్రభుత్వం రంజాన్ తర్వాతిరోజు ఏప్రిల్ 1 న కూడా సెలవు ఇచ్చింది. ఇలా పండగ సెలవుతో ఏప్రిల్ లోకి అడుగుపెట్టగా వేసవి సెలవులతో నెలకు ముగింపు పలకనున్నాం. మధ్యలో కూడా చాలా సెలవులు వస్తున్నాయి. ఏ రోజు ఎందుకు సెలవు ఉందో తెలుసుకుందాం. 

ఈవారం లాంగ్ వీకెండ్ రానుంది.  దళిత నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5 శనివారం సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. తర్వాత ఎలాగూ ఆదివారమే కాబట్టి వరుసగా రెండ్రోజుల సెలవులతో లాంగ్ వీకెండ్ వస్తోంది.  ఏప్రిల్ 6 న శ్రీరామ నవమికి ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది.... ఆరోజు ఆదివారమే కాబట్టి ఎలాగూ సెలవు ఉంటుంది. 

ఇక ఏప్రిల్ 14 సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉంది.  కాబట్టి ఆరోజు కూడా సెలవు ఇచ్చారు.  దీనికి ముందు రెండ్రోజులు రెండో శనివారం, ఆదివారం కూడా సెలవులే... కాబట్టి వరుసగా మూడ్రోజులు విద్యాసంస్థలకు సెలవులు వస్తాయి.  

ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే. ఈ సెలవు కేవలం విద్యార్థులకే కాదు ఉద్యోగులకు వర్తిస్తుంది. ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులకు ఎలాగూ శని, ఆదివారం రెండ్రోజులు సెలవులే. కాబట్టి వారికి ఈ గుడ్ ప్రైడే సెలవు కలిసివచ్చి లాంగ్ వీకెండ్ గా మారుతుంది.  కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా శని, ఆదివారం రెండ్రోజులు సెలవు ఉంటుంది... అందులో చదివే విద్యార్థులకు కూడా వరుసగా మూడ్రోజులు సెలవు వస్తుందన్నమాట. 

ఈ సెలవులతో పాటు మరో మూడు ఆప్షనల్ హాలిడేస్ కూడా ఏప్రిల్ 2025 లో వస్తున్నాయి. ఏప్రిల్ 10 గురువారం రోజు మహవీర్ జయంతి, ఏప్రిల్ 14 సోమవారం తమిళ్ న్యూ ఇయర్,  ఏప్రిల్ 30 బుధవారం బసవ జయంతి సందర్భంగా ఐచ్చిక సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. 


Summer Holidays

తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు : 

తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెల ఏప్రిల్ నుండే వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో ఆ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. ఇక ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి... ఇవి ముగియగానే ఈ విద్యార్థులకు కూడా సమ్మర్ హాలిడేస్ ప్రారంభం అవుతాయి. 

ఇక తెలుగు రాష్ట్రాల్లోని అన్ని విద్యాసంస్థలకు ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివి విద్యార్థులకు త్వరలోనే పరీక్షలు ప్రారంభం కానున్నాయి.  అవి ముగియగానే వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి.  ఇరు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. 

Latest Videos

vuukle one pixel image
click me!